రెండుసార్లు విడాకులు.. ఆమీర్ ఖాన్ ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2022-03-14T15:10:20+05:30 IST

బాలీవుడ్‌లోని పాపులర్ హీరోల్లో ఆమీర్ ఖాన్ ఒకరు. ఈ స్టార్ గతేడాది భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే...

రెండుసార్లు విడాకులు.. ఆమీర్ ఖాన్ ఏమన్నాడంటే..

బాలీవుడ్‌లోని పాపులర్ హీరోల్లో ఆమీర్ ఖాన్ ఒకరు. ఈ స్టార్ గతేడాది భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే.. డైవోర్స్‌పై ఇద్దరూ కామ్‌గానే ఉండిపోయారు. కానీ తాజాగా ఆమీర్ తన విడాకులపై స్పందించాడు.


నిజానికి కిరణ్, ఆమీర్‌కి రెండో భార్య. ఆయనకు అంతకుముందే రీనా దత్తాతో పెళ్లికాగా, వారికి జునైద్, ఐరా అనే పిల్లలు ఉన్నారు. అనంతరం విడాకులు తీసుకోగా.. ఈ స్టార్ కిరణ్‌రావుని పెళ్లి చేసుకున్నాడు. తాజాగా వారిద్దరూ సైతం విడాకులు తీసుకున్నారు.


ఓ ఇంటర్వ్యూలో ఆమీర్ మాట్లాడుతూ.. ‘మా విడాకుల గురించి ప్రజల అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే సాధారణంగా డైవోర్స్ తర్వాత ఒకరిని మరొకరు పట్టించుకోరు. నిజానికి ఒకరిపై ఒకరికి కోపం ఉంటుంది. కానీ మేము వివాహ వ్యవస్థకి గౌరవం ఇవ్వాలని కోరుకున్నాం. దాని గురించి ఎంతో చర్చించాం. అందుకే విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నాం. 


నా ఇద్దరు మాజీ భార్యలతో నాకు మంచి బంధమే ఉండడం నా అదృష్టం. నేను, రీనా, కిరణ్, సత్యజీత్ భత్కల్ కలిసి పానీ ఫౌండేషన్‌ని స్థాపించాం. ఇప్పటికీ అందరం కలిసి ఆ సంస్థకి సంబంధించిన ప్రాజెక్ట్‌లకి కలిసి పని చేస్తున్నాం. అలాగే మా పిల్లల విషయంలో పేరెంట్స్‌గా మా బాధ్యతను నిర్వహిస్తున్నాం’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-03-14T15:10:20+05:30 IST