కిరణ రావ్‌తో విడాకులకు ఎవరూ కారణం కాదంటోన్న ఆమిర్ ఖాన్

ABN , First Publish Date - 2022-03-15T01:19:32+05:30 IST

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా కొత్త తరహా

కిరణ రావ్‌తో విడాకులకు ఎవరూ కారణం కాదంటోన్న ఆమిర్ ఖాన్

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా కొత్త తరహా సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు ఆమిర్ ఖాన్. ప్రేక్షకులు అందరూ ముద్దుగా మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అని పిలుస్తుంటారు. ఆమిర్ ఖాన్ ఇప్పటికే రెండు వివాహాలు చేసుకున్నాడు. మొదటగా రీనాదత్తాతో ఏడడుగులు వేశాడు. ఏమైందో తెలియదు కానీ ఆమెకు విడాకులు ఇచ్చాడు. అనంతరం కిరణ్ రావ్‌తో కలిసి దాంపత్య జీవితాన్ని ప్రారంభించాడు. ఆ బంధానికి కూడా స్వస్తి పలికాడు. 15ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు కొన్ని నెలల క్రితం వీరు ప్రకటించారు. మిస్టర్ ఫర్‌ఫెక్ట్ వివాహేతర సంబంధం నెరపడంతోనే కిరణ్ రావ్‌కు విడాకులు ఇచ్చినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఆమిర్ మార్చి 14న పుట్టిన రోజు జరుపుకొన్నాడు. ఈ నేపథ్యంలో మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో విడాకులపై మాట్లాడాడు.


రీనాదత్తాతో విడాకులు తీసుకోవడానికి కిరణ్ రావ్ కారణం కాదని చెప్పాడు. ఆమెతో విడాకులు తీసుకున్నప్పుడు తన జీవితంలో ఎవరూ లేరని ఆమిర్ తెలిపాడు. కొన్నాళ్లకు  స్నేహితురాలిగా కిరణ్ రావ్ తన జీవితంలోకి వచ్చిందన్నాడు. అనంతరం ఒకరిని మరొకరం అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని వివరించాడు. కొన్నాళ్లకు కిరణ్ రావ్‌తో కూడా ఏడడుగుల బంధానికి ఆమిర్ స్వస్తి పలికాడు. కిరణ్‌కు విడాకులు ఇచ్చినప్పుడు కూడా తన జీవితంలో ఏ కొత్త వ్యక్తి లేరని తెలిపాడు. 


ఆమిర్ ఖాన్- కిరణ్ రావ్ జులై 2021లో వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు ఓ ప్రకటన విడుదల చేశారు.  ‘‘మా 15ఏళ్ల వివాహ బంధం... జీవితానికి సరిపడా చిరునవ్వులు, ఆనందాలను అందించింది. ప్రేమ, నమ్మకం, గౌరవంతోనే ఈ బంధం బలపడింది. మా జీవితాల్లో కొత్త  అధ్యాయాన్ని ప్రారంభించాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. భార్య భర్తలుగా కాకుండా తల్లిదండ్రులు, కటుంబసభ్యలుగా ఉండాలనుకుంటున్నాం. ఎంతో కాలంగా మేం విడిపోవాలని అనుకుంటున్నాం. విడాకులు తీసుకోవడానికి, కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇది సరైన సమయంగా భావిస్తున్నాం’’ అని ఆమిర్, కిరణ్ రావ్ ప్రకటించారు.



Updated Date - 2022-03-15T01:19:32+05:30 IST