బాలీవుడ్ హీరోయిన్‌ను సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్నాడా.. నిజమేంటంటే..?

ABN , First Publish Date - 2022-03-02T21:08:35+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్

బాలీవుడ్ హీరోయిన్‌ను సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్నాడా.. నిజమేంటంటే..?

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్. అభిమానుల్లో అతడికి విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఐదు పదుల వయసు వచ్చినా బాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గానే ఉన్నాడు. పెళ్లి విషయంపై ఇప్పటి వరకు పెదవి విప్పడం లేదు. తాజాగా సల్లూ బాయ్ బాలీవుడ్ హీరోయిన్‌ సోనాక్షి సిన్హాను పెళ్లి చేసుకున్నఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫొటో వైరల్ కావడంతో అతడు రహస్యంగా సోనాక్షిని పెళ్లి చేసుకున్నాడని పుకార్లు షికార్లు చేయడం మొదలుపెట్టాయి. 


సల్మాన్ ఖాన్ పెళ్లి ఫొటోను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నిజమెంత అని ఆరా తీయడం మొదలుపట్టారు. చివరకు ఈ ఫొటో ఫేక్ అని తేలింది. బాలీవుడ్ భాయిజాన్ అభిమానులు మాత్రం తమ హీరో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఆ ఫొటో కింద కామెంట్ చేస్తున్నారు. శత్రఘ్ను సిన్హా కూతురిగా సోనాక్షి సిన్హా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ‘దబాంగ్’ సినిమాలో సల్మాన్ సరసన నటించి బాలీవుడ్‌లోకి  రంగప్రవేశం చేసింది. గత కొంతకాలంగా జహీర్ ఇక్బాల్ అనే నటుడితో ఆమె రిలేషన్‌షిప్ కొనసాగిస్తుంది.

Updated Date - 2022-03-02T21:08:35+05:30 IST