Bigg Boss 6: ఈ వారం బయటకొచ్చేది ఎవరంటే?

ABN , First Publish Date - 2022-10-02T23:43:39+05:30 IST

బిగ్‌బాస్‌ సీజన్‌–6 అప్పుడే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికి ముగ్గురు ఇంటి సభ్యులు ఎలిమినేట్‌ అయ్యారు. ఇంటిలో సఖ్యత కోసం మొదటివారం ఎవరినీ ఎలిమినేట్‌ చేయలేదు.

Bigg Boss 6: ఈ వారం బయటకొచ్చేది ఎవరంటే?

బిగ్‌బాస్‌ సీజన్‌–6 (Biggboss 6)అప్పుడే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికి ముగ్గురు ఇంటి సభ్యులు ఎలిమినేట్‌ అయ్యారు. ఇంటిలో సఖ్యత కోసం మొదటివారం ఎవరినీ ఎలిమినేట్‌ (Elimination)చేయలేదు. రెండో వారం అభినయ శ్రీ, షానీ సాల్మన్‌ను బయటకు పంపగా, మూడో వారంలో మాత్రం అనుకున్నది ఒకటీ.. అయినది ఒకటి అన్నట్లుగా నేహా చౌదరి ఎలిమినేట్‌ అయింది. తాజాగా ఈ వారం 10 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వారిలో ఎవరు బయటకు వెళ్తారు అన్నది ఆదివారం తెలుస్తుంది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నవారిలో రేవంత్‌ గీతూ, శ్రీహాన్‌లకు ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. సత్యతో రొమాంటిక్‌గా ఆట ఆడి, వరెస్ట్‌ పెర్‌పార్మర్‌ కేటగిరీలో జైలుకి వెళ్లిన సత్య కూడా మంచి ఫుటేజ్‌ తెచ్చుకున్నాడు. రాజ్‌, కీర్తి, సుదీప, సూర్య, ఆరోహి(Arohi rao), ఇనయాలలో ఒకరు ఎలిమినేట్‌ అవుతారని తెలుస్తోంది. కానీ ఇనాయాకు ‘పిట్ట’, ‘వాడు వీడు’ కాన్సెప్ట్‌ కలిసొచ్చి జనాల ఆదరణ పెరిగింది. ఓటింగ్‌ కూడా గట్టిగానే పడింది. సుదీప, సూర్య, ఆరోహిలో డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురిలో ఆరోహి ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. సూర్యతో ట్రాక్‌, లిమిటేషన్‌ లేని మాటలు, హౌస్‌లో చర్చలు అందుకు కారణం అని చెబుతున్నారు. ఓటింగ్‌ తెచ్చుకోవడానికి కూడా ఆమె పెద్దగా ఎవరికీ తెలీదు. అయితే బిగ్‌బాస్‌ నాలుగో వారంలో ఆరోహి బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 


Updated Date - 2022-10-02T23:43:39+05:30 IST