రామ్‌చరణ్ - శంకర్ మూవీ షూటింగ్‌ను అడ్డుకున్న బీజేపీ నేతలు

ABN , First Publish Date - 2022-07-26T20:09:34+05:30 IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. RC15 గా పిలుచుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్, సరూర్‌నగర్‌లోని విక్టోరియా గవర్నమెంట్ స్కూల్‌లో జరుగుతోంది.

రామ్‌చరణ్ - శంకర్ మూవీ షూటింగ్‌ను అడ్డుకున్న బీజేపీ నేతలు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. RC15 గా పిలుచుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్, సరూర్‌నగర్‌లోని విక్టోరియా గవర్నమెంట్ స్కూల్‌లో జరుగుతోంది. అక్కడ కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తుండగా.. అనుకోని విధంగా షూటింగ్ కు అడ్డంకి ఏర్పడింది. పలువురు బీజేపీ నేతలు స్కూల్లో సినిమా షూటింగులకు ఎలా అనుమతిస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. షూటింగ్ జరుగుతుంటే క్లాసులు ఎక్కడ నిర్వహించాలని చిత్ర బృందాన్ని నిలదీశారు. ఈ సినిమా షూటింగ్ కోసం స్కూల్‌కు చిత్ర నిర్మాతలు రూ. 4.5 కోట్లు ఇచ్చారని ఆరోపిస్తూ.. వెంటనే షూటింగ్ ఆపాలంటూ బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు.   

Updated Date - 2022-07-26T20:09:34+05:30 IST