Hijab row: సోనమ్ కపూర్‌కి కౌంటర్ ఇచ్చిన బీజేపీ నాయకులు మజిందర్ సింగ్

ABN , First Publish Date - 2022-02-13T19:00:03+05:30 IST

కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ వివాదం గురించి అందరికీ తెలిసిందే. దీనిపై ప్రస్తుతం అక్కడి హైకోర్టులో విచారణ జరుగుతోంది...

Hijab row: సోనమ్ కపూర్‌కి కౌంటర్ ఇచ్చిన బీజేపీ నాయకులు మజిందర్ సింగ్

కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ వివాదం గురించి అందరికీ తెలిసిందే. దీనిపై ప్రస్తుతం అక్కడి హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కాంట్రవర్సీపై ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు స్పందించారు. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ సైతం ఈ వివాదంపై తన అభిప్రాయాన్ని తెలిపింది. ఈ బ్యూటీ హిజాబ్‌ని టర్బన్‌ని పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.


అందులో హిజాబ్‌కి సపోర్టు చేస్తూ సోనమ్.. ‘సిక్కుల ధరించే టర్బన్ ఓ సంప్రదాయం అయినప్పుడు హిజాబ్ ఎందుకు కాదు’ అంటూ స్టోరీలలో షేర్ చేసింది. ఇప్పటికే సోనమ్ కపూర్ కామెంట్స్‌కి కొందరు సిక్కు నాయకులు కౌంటర్ ఇవ్వగా.. తాజాగా బీజేపీ నాయకులు మజిందర్ సింగ్ సిర్షా స్పందించారు.


సోనమ్ ఇన్‌స్టా పోస్ట్‌ని షేర్ చేసిన మజిందర్.. ‘దస్తార్ అంటే ‘దేవుడి హస్తం’ అని అర్థం. ఇది ఛాయిస్ కాదు. శ్రీ గురు గోవింద్ సింగ్ జీ సిక్కులకి ఇచ్చిన ఆశీర్వాదం. వివాదాస్పద పరిస్థితుల్లో దస్తర్, హిజాబ్‌లను పోల్చడం కరెక్ట్ కాదు’ అంటూ దానికి కౌంటర్‌గా రాసుకొచ్చారు.



Updated Date - 2022-02-13T19:00:03+05:30 IST