సుశాంత్ బర్త్‌డే ట్రీట్: ‘రావణాసుర’ స్పెష‌ల్ పోస్ట‌ర్

ABN , First Publish Date - 2022-03-19T02:25:12+05:30 IST

మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. ఈ చిత్రం మేజర్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రవితేజతో పాటు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్న సుశాంత్ కూడా షూటింగ్‌లో..

సుశాంత్ బర్త్‌డే ట్రీట్: ‘రావణాసుర’ స్పెష‌ల్ పోస్ట‌ర్

మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. ఈ చిత్రం మేజర్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. రవితేజతో పాటు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్న సుశాంత్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు. శుక్రవారం సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ టీమ్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. సుశాంత్ నీలి రంగు క‌ళ్ళ‌తో, పొడవాటి జుట్టు, గడ్డంతో తీక్ష‌ణంగా చూస్తున్నట్లు క‌నిపిస్తున్నాడు. దీనిని బ‌ట్టి ఆయ‌న పాత్ర వైవిధ్యంగా ఉండబోతుందనేది అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టి టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తుండగా.. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ మొత్తం ఐదుగురు కథానాయికలు ఇందులో రవితేజ సరసన నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ లాయర్‌గా కనిపించనున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ సినిమా కోసం కొత్త తరహా కథను రచించారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంయుక్తంగా సంగీతం సమకూర్చుతున్నారు.

Updated Date - 2022-03-19T02:25:12+05:30 IST