పుట్టిన రోజు పార్టీ

ABN , First Publish Date - 2022-06-27T10:06:50+05:30 IST

లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌ డే’. నరేష్‌ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రధారులు...

పుట్టిన రోజు పార్టీ

లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌ డే’. నరేష్‌ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రధారులు. ‘మత్తు వదలరా’తో ఆకట్టుకొన్న రితేష్‌ రానా దర్శకత్వం వహించారు. చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మాతలు. జులై 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘జులై 15న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకొన్నాం. ఇప్పుడు ఓ వారం ముందుగానే తీసుకొస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తోంది. వినోదం, థ్రిల్‌, సస్పెన్స్‌ కలగలిపిన కథ ఇది. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంద’’న్నారు. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ.

Updated Date - 2022-06-27T10:06:50+05:30 IST