అప్పటి వరకు నా ప్రెగ్నెన్సీ గురించి వార్తలు వస్తూనే ఉంటాయి: Bipasha Basu

ABN , First Publish Date - 2021-10-25T17:45:26+05:30 IST

బాలీవుడ్ హాట్ హీరోయిన్‌గా, ఫిట్నెస్ ఐకాన్‌గా అభిమానులను అలరించింది బిపాసా బసు.

అప్పటి వరకు నా ప్రెగ్నెన్సీ గురించి వార్తలు వస్తూనే ఉంటాయి: Bipasha Basu

బాలీవుడ్ హాట్ హీరోయిన్‌గా, ఫిట్నెస్ ఐకాన్‌గా అభిమానులను అలరించింది బిపాసా బసు. 2016లో కరణ్ సింగ్ గ్రోవర్‌ను వివాహం చేసుకున్న బిపాస అప్పట్నుంచి సినిమాలు తగ్గించింది. అయితే అప్పట్నుంచి ఆమె ప్రెగ్నెన్సీ వార్తలు మొదలయ్యాయి. బిపాస కొంచెం లావుగా కనిపిస్తే చాలు ఆమె గర్భవతి అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. తాజాగా మరోసారి కూడా అలాంటి వార్తలే మొదలయ్యాయి. 


ఆ వార్తలపై బిపాసా స్పందించింది. `నేను ఫిట్‌నెస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌నని తెలుసు. కానీ, నాకు కూడా జీవితంలో చిన్న చిన్న కోరికలుంటాయి. నచ్చినట్టు జీవించాలని ఉంటుంది. ప్రస్తుతం నేను నా జీవితాన్ని ఆస్వాదిస్తున్నా. నేను బరువు పెరిగినంత మాత్రాన నేను అనారోగ్యానికి గురైనట్టు కాదు, గర్భవతిని అయినట్టు కాదు. నా చేతిలో నిజమైన నా బిడ్డను చూసే వరకు ప్రెగ్నెన్సీ రూమర్స్ ఆగవని నాకు అర్థమైంది` అంటూ బిపాస చెప్పింది. 

Updated Date - 2021-10-25T17:45:26+05:30 IST