Bimbisara: ఆకట్టుకుంటున్న ‘విజయహో’ సాంగ్.!

ABN , First Publish Date - 2022-08-04T19:36:48+05:30 IST

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyanram) నటించిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara). టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో సోషియో ఫాంటసీ కథాంశంగా ఈ సినిమా రూపొందించారు.

Bimbisara: ఆకట్టుకుంటున్న ‘విజయహో’ సాంగ్.!

నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyanram) నటించిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara). టైమ్ ట్రావెలింగ్ నేపథ్యంలో సోషియో ఫాంటసీ కథాంశంగా ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 5న థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఇదివరకు విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా మూవీ నుంచి మరో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘బింబిసార’ సినిమాతో మల్లిడి వశిష్ట్ (Mallidi Vashist) టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మూవీలో క్యాథరీన్ థ్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon), వరీన హుస్సేన్ (Warina Hussain) హీరోయిన్స్‌గా నటించారు. 


అయితే, తాజాగా ఈ సినిమా నుంచి 'విజయహో' అనే ఈ సాంగ్ రిలీజ్ అయింది. కళ్యాణ్ రామ్ పోషించిన బింబి పాత్రకి అద్దం పట్టేలా అద్భుతమైన లిరిక్స్ తో ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ సాంగ్‌లో  విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే, కీరవాణి తన మార్క్ మ్యూజిక్ ని ఈ సాంగ్ లోనూ వినిపించారు. విడుదలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అభిమానుల్లో, ప్రక్షకుల్లో ఆతృతను పెంచేందుకే ఇప్పుడు విజయహో సాంగ్‌ను రిలీజ్ చేశారనిపిస్తోంది. 


ఇక హీరో కళ్యాణ్ రామ్ నుంచి సినిమా వచ్చి రెండేళ్ళు దాటిపోయింది. ఆయన నటించిన గత చిత్రం ఎంతమంచివాడవురా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దాంతో కళ్యాణ్ రామ్ ఇప్పుడు నటించిన బింబిసార మూవీతో భారీ హిట్ కొట్టాలని కసితో ఉన్నారు. మరి ఆయన ఆశించిన సక్సెస్ ఈ మూవీతో అందుకుంటారా లేదా అనేది మరికొన్ని గంటలు ఆగితేగానీ తెలియదు.



Updated Date - 2022-08-04T19:36:48+05:30 IST