Bimbisara: ట్విట్టర్ రివ్యూ..

ABN , First Publish Date - 2022-08-05T14:10:43+05:30 IST

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) బింబిసార (Bimbisara) మూవీతో థియేటర్స్‌లో సందడి మొదలు పెట్టారు. ఈ సినిమాతో మల్లిడి వశిష్ట్ (Mallidi Vashist) టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Bimbisara: ట్విట్టర్ రివ్యూ..

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) బింబిసార (Bimbisara) మూవీతో థియేటర్స్‌లో సందడి మొదలు పెట్టారు. ఈ సినిమాతో మల్లిడి వశిష్ట్ (Mallidi Vashist) టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మూవీలో క్యాథరీన్ థ్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon), వరీన హుస్సేన్ (Warina Hussain) హీరోయిన్స్‌గా నటించారు. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో.. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ.కె ఈ మూవీని నిర్మించారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన 'బింబిసార' అందరి అంచనాలను అందుకుందా..? ట్వీట్టర్‌లో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం..


బింబిసార చిత్ర కథ క్రీస్తు పూర్వం 500 ఏళ్ల క్రితం త్రిగర్తల సామ్రాజ్యం నిధి చుట్టూ తిరుగుతుంది. ఆ సామ్రాజ్యానికి రాజు బిసారుడిగా కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారు..అని ఆడియన్స్ అంటున్నారు. తన సామ్రాజ్య నిధిని కలియుగంలో ఎలా కాపాడుకున్నాడు..అనేది మూవీలో చాలా ఆసక్తికరం. ఫస్ట్ హాఫ్ సూపర్‌గా ఉంది.. విజువల్ వండర్‌లా ఉంటుంది ఈ సినిమా.. అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్స్ మెస్మరైజ్ చేస్తాయంటున్నారు. 


హీరో ఎన్టీఆర్ చెప్పినట్లుగానే బింబిసార సినిమాను కళ్యాణ్ రామ్ తప్ప ఇంకెవరూ చేయలేరు అనే విధంగా ట్వీట్స్ పెడుతున్నారు ఆడియన్స్. వన్ మ్యాన్ షోగా సినిమాను మొత్తం కళ్యాణ్ రామ్ తన భూజాలపై మోసినట్లు ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాను ఎంతో డెడికేషన్‌తో చేశారని.. ప్రేక్షకులను మరో ప్రపంచంలో తీసుకెళుందంటూ ట్వీట్టర్‌లో ఆడియన్స్ రివ్యూ ఇస్తున్నారు. స్టోరీ సూపర్‌గా ఉందని.. విజువల్స్ అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్‌గా ఉన్నాయని పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా చూస్తే బింబిసార చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుంది. 


ఇక బింబిసార సినిమాకు టాలీవుడ్ హీరోలు కూడా తమ మద్దతు తెలుపుతున్నారు. మూవీ టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెబుతూ.. హీరోలు సాయిధరమ్ తేజ్, సత్యదేవ్ ట్వీట్ చేశారు. 'ఈ రోజు బింబిసార మూవీ విడుదవుతున్న సందర్భంగా, నా సోదరుడు కళ్యాణ్ రామ్‌కు శుభాకాంక్షలు. తన కృషి, మంచి హృదయం ఎప్పుడూ విజయవంతమవుతుంది..' అని మంచు విష్ణు ట్వీట్ చేశారు. 











Updated Date - 2022-08-05T14:10:43+05:30 IST