Kalyan ram: తాతకు అంకితం!

ABN , First Publish Date - 2022-07-05T01:04:06+05:30 IST

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ‘బింబిసారా’ చిత్రం ట్రైలర్‌ను సోమవారం కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌’ అన్నది ట్యాగ్‌ లైన్‌.

Kalyan ram: తాతకు అంకితం!

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ (Nandamuri kalyan ram) హీరోగా వశిష్ఠ (Vasista)దర్శకత్వం వహిస్తున్న ‘బింబిసారా’ (Bimbisara)చిత్రం ట్రైలర్‌ను సోమవారం కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌’ అన్నది ట్యాగ్‌ లైన్‌. ట్రైలర్‌ ఆవిష్కరణ అనంతరం నందమూరి కళ్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ ‘‘ఎన్నో చందమామ కథలు విన్నాం. కొన్ని చూశాం. తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మ కొన్ని కథలు చెబితే, కొన్నింటిని మనం పుస్తకాల్లో చదివాం. కొన్నింటిని వెండితెరపై చూసుంటాం. తాతగారు చేసిన పాతాళభైరవి, గులేబకావళి కథ, జగదేవీరుని కథ, బాబాయ్‌ చేసిన భైరవ ద్వీపం, తర్వాత వచ్చిన ఆదిత్య 369.. తర్వాత చిరంజీవిగారు చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి, మా జనరేషన్‌లో తమ్ముడు చేసిన యమదొంగ, రామ్‌ చరణ్‌ చేసిన మగధీర, రీసెంట్‌గా వచ్చిన ‘బాహుబలి’ సినిమాలు గమనిేస్త.. అన్ని అందమైన సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. అలాంటి అందమైన గొప్ప చందమామ కథను ‘బింబిసార’. మా తాతగారికి ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నా’’ అని అన్నారు. (Bimbisara on 5th august)

సంయుక్తా మీనన్‌ మాట్లాడుతూ ‘‘సినిమాకు ఇంత మంచి లవ్‌, సపోర్ట్‌ మరెక్కడా చూడలేదు. కేవలం తెలుగు ఇండస్ర్టీలోనే కనిపిస్తోంది’’ అని అన్నారు. 

కేథరిన్‌ మాట్లాడుతూ ‘రుద్రమదేవి తర్వాత నేను నటించిన పీరియాడిక్‌ సినిమా  ఇది. ఇందులో ఐరా అనే పాత్రలో నటించాను’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఛోటా.కె.నాయుడు, సంగీతం: చిరంతన్‌ భట్‌, నేపథ్య సంగీతం: ఎం.ఎం.కీరవాణి. 


Updated Date - 2022-07-05T01:04:06+05:30 IST