Bimbisara: వైరల్ అవుతున్న మేకింగ్ వీడియో..

ABN , First Publish Date - 2022-08-16T18:55:51+05:30 IST

తాజాగా ‘బింబిసార’ (Bimbisara) సినిమాకు సంబందించిన మేకింగ్ వీడియో వచ్చి నెట్టింట వైరల్ అవుతోంది. నందమూరి కల్యాణ్‌రామ్‌ (Nandamuri KalyanRam) హీరోగా రూపొందించిన సినిమా ఇది.

Bimbisara: వైరల్ అవుతున్న మేకింగ్ వీడియో..

తాజాగా ‘బింబిసార’ (Bimbisara) సినిమాకు సంబందించిన మేకింగ్ వీడియో వచ్చి నెట్టింట వైరల్ అవుతోంది. నందమూరి కళ్యాణ్‌రామ్‌ (Nandamuri Kalyan Ram) హీరోగా రూపొందించిన సినిమా ఇది. బింబిసార వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించి తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా తనదైన ముద్రవేశారు మల్లిడి వశిష్ఠ (Mallidi vashishta). ఇటీవల విడుదలై తెలుగు చిత్ర పరిశ్రమలో నూతనోత్తేజాన్ని తీసుకొచ్చిన చిత్రాల్లో ఒకటి. గత వారం భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతూ సినీ ప్రముఖుల నుంచి గొప్ప ప్రశంసలను అందుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘ది క్రానికల్స్‌’ పేరుతో మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది.


తెలుగులో సోషియో ఫాంటసీ కథలను తెరకెక్కించటం కొత్తేమీ కాదు. అయితే, కొత్త దర్శకుడు ఇలాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించడం మాత్రం పెద్ద సాహసమని చెప్పాలి. ఇక తాజాగా విడుదల చేసిన వీడియో చూస్తే బింబిసారా కోసం ఎంత కష్ట పడ్డారో అర్థమవుతోంది. సినిమా సెట్స్‌లో వాతావరణం ఎలా ఉంటుంది? ఈ సినిమాలోని పోరాట దృశ్యాల్ని ఎలా చిత్రీకరించారు? హీరో పరిగెత్తే సన్నివేశాలని ఎలా షూట్ చేశారు? వంటి పలు ఆసక్తికరమైన విశేషాలను ఈ వీడియోలో చూడొచ్చు. 


ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇక నందమూరి అభిమానులైతే తెగ వైరల్ చేసేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం బాగా ప్లస్ అయింది. అలాగే, చోటా కె. నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ ఈ మూవీని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. కల్యాణ్‌రామ్‌ సరసన కేథరిన్‌, సంయుక్తా మేనన్‌ హీరోయిన్స్‌గా నటించారు. కాగా, ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి సీక్వెల్‌ కూడా రూపొంచడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 



Updated Date - 2022-08-16T18:55:51+05:30 IST