Bimbisara: రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఆయనకే..?

ABN , First Publish Date - 2022-07-09T14:16:01+05:30 IST

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా బింబిసార (Bimbisara). తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ రెండు తెలుగు

Bimbisara: రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఆయనకే..?

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా బింబిసార (Bimbisara). తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) దక్కించుకున్నారట. 2020లో వచ్చిన ఎంత మంచివాడవురా తర్వాత మళ్ళీ కళ్యాణ్ రామ్ నుంచి సినిమా రాలేదు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో కాస్త ఆలస్యం అయినా హిట్ కొట్టే కథతోనే రావాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు కళ్యాణ్ రామ్.


ఆ ఆలోచనతోనే ప్రస్తుతం నడుస్తున్న పాన్ ఇండియా సినిమా ట్రెండ్‌ను ఫాలో అవుతూ బింబిసార చిత్రాన్ని చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ (NTR Atrs) పతాకంపై కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, హై టెక్నీకల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. త్రిగర్తల రాజ్య ప్రభువు అయిన బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. యువ దర్శకుడు మల్లిడి వశిష్ట్ (Mallidi Vasisht) తొలిసారిగా మెగా ఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీ నుంచి వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబట్టి సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.


దీంతో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు బింబిసార రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ని దక్కించుకున్నారట. దీని కోసం భారీ మొత్తాన్నే చెల్లించినట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా క్యాథరీన్ థ్రెసా (Catherine Tresa), సంయుక్తా మీనన్ (Samyuktha Menon), వరీన హుస్సేన్ (Warina Hussain) నటిస్తున్నారు. ఆగష్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. చిరంతన్ భట్ మ్యూజిక్, ఎం ఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ ఆశిస్తున్న భారీ సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి. 

Updated Date - 2022-07-09T14:16:01+05:30 IST