Bimbisara final collections: బింబిసార ఫైనల్ కలక్షన్స్ ఇవే!

ABN , First Publish Date - 2022-09-27T22:07:18+05:30 IST

బింబిసార సినిమా థియేట్రికల్ హక్కులు (Theatrical rights) 15 కోట్లకు (15 crore) అమ్ముడుపోయాయి. ఫైనల్ గా ఈ సినిమా సుమారు 35 కోట్లు (35 crore) కలెక్ట్ చేసిందని (collect( ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.

Bimbisara final collections: బింబిసార ఫైనల్ కలక్షన్స్ ఇవే!

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నటించిన బింబిసార (Bimbisara) సినిమా బ్లాక్ బస్టర్ (Blockbuster)గా నిలించింది. కాథరిన్ ట్రెసా (Catherine Tresa) మరియు సంయుక్త మీనన్ (Samyukta Menon) ఇందులో కథానాయికలుగా నటించారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు (Theatrical rights) 15 కోట్లకు (15 crore) అమ్ముడుపోయాయి. ఫైనల్ గా ఈ సినిమా సుమారు 35 కోట్లు (35 crore) కలెక్ట్ చేసిందని (collect( ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.కానీ ఈ సినిమా బడ్జెట్ (Budget) పరంగా చూస్తే కనక ఈ కలక్షన్స్ అంతగా సరిపోవు అని కూడా అంటున్నారు.


అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత అయిందీ నిర్మాతలు ఎప్పుడూ బయట పెట్టలేదు కానీ, కొంచెం ఎక్కువ అయినట్టే కనపడుతోంది. ఈ సినిమాను ఎంతకి కొన్నారు, ఎంత కలెక్ట్ చేసింది అనే పాయింట్ మీదే ఈ సినిమాను బ్లాక్ బస్టర్ అని డిక్లేర్ చేసారు అని తెలిసింది. కానీ ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ బాగా ఉండటం తో దానికి ఖర్చు చాలానే అయిందని, అందుకే బడ్జెట్ కూడా బాగా పెరిగింది అని అంటున్నారు. కళ్యాణ్ రామ్ సినిమాకి మామూలుగా అయ్యే సినిమా ఖర్చు కన్నా, ఈ సినిమాకి చాలా ఎక్కువ అయిందని సుమారు 35 కోట్ల వరకు బడ్జెట్ అయిందని అంటున్నారు. ఈ సినిమా కథ పీరియడ్ డ్రామా (period drama), అందులో రాజులు, రాజ్యాలు, కట్టడాలు అవన్నీ చూపించడానికి గ్రాఫిక్స్ (Computer Graphics) వాడారు. అయితే ఈ సినిమాకి ఓటిటి మరియు శాటిలైట్ హక్కులు (Sattelite rights) ద్వారా బాగా డబ్బులు వచ్చాయని కూడా తెలిసింది. అదీ కాకుండా ఈ సినిమా హిందీ డబ్బింగ్ (Hindi dubbing rights) హక్కులు వల్ల కూడా బాగానే రెవిన్యూ వచ్చిందని, ఇవన్నీ చూస్తే కానక ఈ సినిమా లాభసాటిగా ఉందని పరిశ్రమలోని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. 

Updated Date - 2022-09-27T22:07:18+05:30 IST