Bigil : ప్రీక్వెల్ రాబోతోందా?

ABN , First Publish Date - 2022-05-25T18:30:27+05:30 IST

తమిళ దళపతి విజయ్ (Vijay), అట్లీ (Atlee) కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘బిగిల్’ (Bigil). తెలుగులో ‘విజిల్‌’ (Wistle) గా విడుదలైన ఈ సినిమా కోలీవుడ్ లోనూ, టాలీవుడ్‌లోనూ మంచి సక్సెస్ సాధించింది. ఇందులో విజయ్ రాయప్పన్, మైఖేల్‌ పాత్రలతో తండ్రీ కొడుకులుగా నటించి మెప్పించాడు. మైకేల్ మహిళల ఫుట్ బాల్ టీమ్‌కు కోచ్‌ అయితే.. రాయప్పన్ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్. తండ్రి ఆశయం నెరవేర్చడానికి కొడుకు మైఖేల్ ఫుట్‌బాల్ టీమ్ ద్వారా ఏం చేశాడు అన్నదే ఈ సినిమా కథాంశం.

Bigil : ప్రీక్వెల్ రాబోతోందా?

తమిళ దళపతి విజయ్ (Vijay), అట్లీ (Atlee)  కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘బిగిల్’ (Bigil). తెలుగులో ‘విజిల్‌’ (Wistle) గా విడుదలైన ఈ సినిమా కోలీవుడ్ లోనూ, టాలీవుడ్‌లోనూ మంచి సక్సెస్ సాధించింది. ఇందులో విజయ్ రాయప్పన్, మైఖేల్‌ పాత్రలతో తండ్రీ కొడుకులుగా నటించి మెప్పించాడు. మైకేల్ మహిళల ఫుట్ బాల్ టీమ్‌కు కోచ్‌ అయితే.. రాయప్పన్ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్. తండ్రి ఆశయం నెరవేర్చడానికి కొడుకు మైఖేల్ ఫుట్‌బాల్ టీమ్ ద్వారా ఏం చేశాడు అన్నదే ఈ సినిమా కథాంశం. నయనతార (Nayanathara) కథానాయికగా నటించగా.. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ (jokey shrof) విలన్‌గా మెప్పించాడు.  పేరుకు స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ.. ఇదో కమర్షియల్ మాస్ యాక్షన్ మూవీ. ఇక ఈ సినిమాకి సీక్వెల్ తీయాలనే ఆలోచన దర్శకుడు అట్లీకి రానప్పటికీ... రాయప్పన్ పాత్ర ఆధారంగా ఫుల్ మూవీ తీసే అవకాశాలున్నట్టు దర్శకుడిచ్చిన హింట్‌తో అర్ధమవుతోంది. 


‘బిగిల్’ (Bigil) చిత్రం ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వారు..  ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. విజయ్ (Vijay) చేసిన రెండు పాత్రల్లో రాయప్పన్ పాత్రపై సెపరేట్ గా ఒక సినిమా వస్తే ఎలా ఉంటుంది? అనే ప్రశ్న సంధించారు. దానికి.. ‘చేసేస్తే పోలా..’ అంటూ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు దర్శకుడు అట్లీ (Atlee). దాంతో బిగిల్ ప్రీక్వెల్ రాబోతున్నట్టు అభిమానులు సంబరపడిపోతున్నారు. నిజానికి ‘బిగిల్’ చిత్రంలో రాయప్పన్ పాత్ర చనిపోతుంది. ఒక వేళ ఆ పాత్రతో ఫుల్ లెంత్ సినిమా తీస్తే.. అది ‘బిగిల్’ చిత్రానికి ప్రీక్వెలే అవుతుంది. ఆ పాత్ర పుట్టు పూర్వోత్తరాలు, అతడు గ్యాంగ్‌స్టర్ గా ఎదిగే క్రమం.. ఇలా ఆసక్తికరంగా ఆ సినిమాను తెరకెక్కించవచ్చు. ప్రస్తుతం అట్లీ ఇదే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 


ప్రస్తుతం దర్శకుడు అట్లీ (Atlee) బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (SharuKh Khan) తో ఓ సినిమా తీసే సన్నాహాల్లో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అట్లీ తీయబోయేది ‘బిగిల్’ (Bigil) ప్రీక్వెల్ అని తెలుస్తోంది.  ‘రాయప్పన్’ టైటిల్ తోనే ఈ సినిమా ఉంటుందని సమాచారం అందుతోంది. దీనికి తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా ఉంటుందని వేరే చెప్పాల్సిన పనిలేదు. మరి అట్లీ ఈ సినిమాను ఎప్పుడు తెరకెక్కిస్తాడో చూడాలి. 

Updated Date - 2022-05-25T18:30:27+05:30 IST