Bigg Boss 6: వందసార్లు చెప్పించుకునే అలవాటు లేదు.. ఇనయాపై ఫైర్‌!

ABN , First Publish Date - 2022-09-26T22:09:27+05:30 IST

మూడోవారం ఎలిమినేషన్స్‌ పూర్తయ్యాయి. యాంకర్‌ నేహా చౌదరి బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచీ బయటకు వచ్చేసింది. తదుపరి వారానికి సంబంధించిన నామినేషన్స్‌ ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

Bigg Boss 6: వందసార్లు చెప్పించుకునే అలవాటు లేదు.. ఇనయాపై ఫైర్‌!

మూడోవారం ఎలిమినేషన్స్‌ పూర్తయ్యాయి. యాంకర్‌ నేహా చౌదరి (Neha chowdary eliminated) బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచీ బయటకు వచ్చేసింది. తదుపరి వారానికి సంబంధించిన నామినేషన్స్‌ ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ‘అడవిలో ఆట’ టాస్క్‌లో ‘వాడు’ అని శ్రీహాన్‌ని అనడం, ఇనాయాను ఇనాయాను పిట్ట అన్న ఇష్యూ మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ టాపిక్‌పై నాగార్జున (Akkineni Nagarjuna)అందరినీ కలిపి క్లాస్‌ పీకారు. గీతూని(Geethu royal) నోటి దూల తగ్గించుకోమని నాగ్‌ చెప్పారు. అయితే తాజా నామినేషన్స్‌ కూడా అంతే వేడిగా జరిగాయి. ఈ సారి కూడా ఇనాయా టార్గెట్‌ అయింది. ఈ ప్రక్రియలో భాగంగా ఒక్కొక్కరు ఇద్దరిద్దరు చొప్పున నామినేట్‌ చేస్తూ వాళ్ల తలపై టమోటో కొట్టాలని బిగ్‌ బాస్‌ ఆదేశించారు. దీంతో.. శ్రీహాన్‌ ఇనయాని నామినేట్‌ చేస్తూ బాగా అతి చేశాడు. పాట పిట్ట కథకు ఇప్పుడు ఎలుక కథను జోడించాడు. ఓ ఎలుక అలా వెళ్తు నీ కాలి మీద ఎక్కితే అది నా కాలి మీద నుంచి వెళ్లింది నన్నే అన్నావ్‌ నువ్వు’ అనే మెంటాలిటీ నీది అంటూ ఇనాయపై యాటిట్యూట్‌ చూపించాడు శ్రీహాన్‌. ఇక ఏజ్‌ విషయంలో కూడా శ్రీహాన్‌–ఇనయల మధ్య చర్చ జరిగింది. నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతా జవాబు చెప్పు అని ఇనయ అంటుంది. నచ్చితే చెప్తా.. నచ్చకపోతే చెప్పను అంటాడు. ‘నా ఏజ్‌ ఎక్కువ అని అన్నావ్‌ అలా ఎలా అన్నావ్‌.. నేను మనిషిని పెద్దగా కనిపిస్తే  నా ఏజ్‌ అంత ఎక్కువగా కనిపిస్తుందా? స్నేహం చేస్తే ప్రాణం ఇస్త్తా’ అని ఇనయ అంటుంటే.. ‘హ్యాపీ ఫ్రెండ్‌ షిప్‌ డే’ అని వెటకారంగా మాట్లాడాడు శ్రీహాన్‌. అయితే శ్రీహాన్‌ కావాలనే ఇలా అతి చేస్తున్నాడు అని ప్రేక్షకులు గమనించారు. దీనితో అతనికి ఓట్లు ఛాన్స్‌ తగ్గే అవకాశం ఉందంటున్నారు. తదుపరి పింకీ కూడా ఇనాయాపై ఫైర్‌ అయింది. ముందు చెప్పింది వినే.. నేను కూడా వాయిస్‌ పెంచి మాట్లాడగలను. నీకు వందసార్లు చెప్పించుకునే అలవాటు నాకు లేదు. ఒకసారి చెబితే నాకు అర్థమవుతోంది’ అంటూ ఇనాయాకు ఓ డోస్‌ ఇచ్చింది సుదీప. 





గీతూ, ఆరోహి, పింకీ ఇలా మిగిలిన వారంతా ఇనాయానే నామినేట్‌ చేశారు. నిజానికి ఇనయ ఆట అంత గొప్పగా లేకపోయినా ఆమె అందరూ కార్నర్‌ చేయడం, టార్గెట్‌గా మాట్లాడటం, ఒంటరిని చేయడంతో ఆమె స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా మారుతోంది. ఈ నామినేషన్స్‌లో ఆర్జే సూర్య, ఆరోహి, శ్రీహాన్‌, ఇనయ, అర్జున్‌ కళ్యాణ్‌, రేవంత్‌, గీతు, రాజ్‌, సుదీప, కీర్తి పదిమంది నామినేట్‌ అయ్యారు. వీరిలో కీర్తి, అర్జున్‌ కళ్యాణ్‌లను హోస్ట్‌ నాగార్జున పూర్‌ పెర్ఫార్మెన్స్‌ కారణంతో నేరుగా నామినేట్‌ చేశారు. మరి వీరిలో వచ్చేవారం దుకాణం సర్దేది ఎవరో చూడాలి. 



Updated Date - 2022-09-26T22:09:27+05:30 IST