Biggboss 6: టచ్‌కి.. ముద్దుకి డబ్బులు.. పైగా అక్కడ గిల్లేశాడు

ABN , First Publish Date - 2022-10-01T21:29:26+05:30 IST

బిగ్‌బాస్‌ హౌస్‌లో నాలుగోవారం కెప్టెన్‌ ఎంపిక హాట్‌హాట్‌గా సాగింది. ఉదయం ‘సిటీ మార్‌’ పాటకు స్టెప్పులేశారంతా. ఆ తర్వాత ఒక్కొక్కరు తమ పనుల్లో నిమగ్నమైపోయారు. సత్య, సుదీప్‌ రేవంత్‌పై డైలాగ్‌లు మొదలుపెట్టారు.

Biggboss 6: టచ్‌కి.. ముద్దుకి డబ్బులు.. పైగా అక్కడ గిల్లేశాడు

బిగ్‌బాస్‌ హౌస్‌(Biggboss6)లో నాలుగోవారం కెప్టెన్‌ ఎంపిక హాట్‌హాట్‌గా సాగింది. ఉదయం ‘సిటీ మార్‌’(Seetimaar) పాటకు స్టెప్పులేశారంతా. ఆ తర్వాత ఒక్కొక్కరు తమ పనుల్లో నిమగ్నమైపోయారు. సత్య, సుదీప్‌ రేవంత్‌పై డైలాగ్‌లు మొదలుపెట్టారు. పనులు చేయడం విషయంలో పంచాయతీ మొదలైంది. కెప్టెన్‌ ఆదిరెడ్డిపై రేవంత్‌ రచ్చ లేపాడు.  చిన్న విషయానికి కూడా ఎందుకిలా వాదిస్తావు.. నువ్‌ కెప్టెన్‌ స్థానంలో ఉన్నప్పుడు నాకు ఏది చెప్పినా నోరు మూసుకుని వింటా.. నువ్‌ కూడా వినాలి అని ఆదిరెడ్డి అనడంతో.. రేవంత్‌ తట్టుకోలేకపోయాడు. నిద్రపోయానంటావ్‌.. పోలేదంటావ్‌.. ఎందుకిలా మాటలు మార్చుతావ్‌ అని ఆదిరెడ్డి అనడంతో ‘నేను ఒక్కడినే కనిపిస్తున్నానా మిగిలిన వాళ్లను ఎందుకు అడగడం లేదు అంటూ వార్‌కి దిగుతాడు రేవంత్‌. ఏం మాట్లాడుతున్నావ్‌ బ్రదర్‌ నేను చూస్తేనే కదా ఎవరికైనా పనిష్మెంట్‌ ఇస్తాను.. ఎందుకు అలా అడ్డంగా వాదిస్తావ్‌ అంటూ ఆదిరెడ్డి ఫైర్‌ అయ్యాడు. (MOney for touch and kiss)


గిల్లేశాడా...

ఫైమా కూడా ఫుటేజ్‌ కోసం చాలా కష్టపడుతోంది. రాజ్‌ మీద పడి పడి దొర్లే ఆమె ‘రాజ్‌ నా మీద చేయి వేశాడు.. నడుము గిల్లాడు’ అంటూ చిల్లర చేష్టలు చేసింది. ఎలా గిల్లాడో సత్య నడుమును గిల్లి చూపించింది. పైగా శ్రీసత్య డబుల్‌ మీనింగ్‌తో.. గిల్లేశాడా? ఇక ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంటూ ఓవర్‌ యాక్షన్‌ చేసింది. ఈలోపే పంచ్‌ పడుద్ది టాస్క్‌ కోసం బిగ్‌బాస్‌ పిలుపు రావడంతో అందరూ ఎలర్ట్‌ అయ్యారు. మొదటి బజర్‌కి ఇనయా బాక్సింగ్‌ గ్లౌజ్‌ దక్కించుకుని వరుసగా నిలబడిన ఇంటి సభ్యులను ‘మీలో కెప్టెన్‌ కావడానికి అర్హతలు ఏమున్నాయో చెప్పమని అడుగుతుంది. ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను తెలిపారు. (Sri satya and Arjun kalyan)




టాప్‌ 5లో ఉండాలి.. 

ఆర్జే సూర్య స్టోర్‌ రూంలో కూర్చుని అమ్మ గుర్తొచ్చిందీ అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అది తెలుసుకున్న ఆరోహి ఆగుతుందా? వెళ్లి  అతని ఒళ్లో సెటిల్‌ అయిపోయి ఓదారుస్తుంది. తర్వాత కీర్తి కూడా వాళ్లతో జాయిన్‌ అవుతుంది. కళ్లు తుడుచుకున్న సూర్య మళ్లీ కెమెరా ముందు యాక్టింగ్‌ మొదలెట్టాడు. ‘సూర్య నువ్‌ టాప్‌ 5లో ఉండాలి.. స్ర్టాంగ్‌గా ఉండాలి’ అంటూ మొదలెట్టాడు.. ఫైనల్‌గా  కెప్టెన్సీ రేస్‌లో సుదీప, కీర్తి, శ్రీ సత్య నిలిచారు. 


ముద్దులు, టచ్‌ల కోసం వచ్చాడా 

మరోపక్క రోహిత్‌ మెరీనా, కీర్తి, ఆరోహి బ్యాచ్‌ మఽఽధ్య అర్జున్‌–శ్రీ సత్యల గురించి ఆసక్తికరమైన చర్చ నడిచింది.  అర్జున్‌ కళ్యాణ్‌ టాస్క్‌లో తన దగ్గర ఉన్నదంతా శ్రీ సత్యకి ఇచ్చేయడంపై వారంతా డిస్కర్షన్‌ మాట్లాడారు. శ్రీ సత్యని టచ్‌ చేయనిస్తే డబ్బు, ముద్దు ఇస్తానని అర్జున్‌ అన్నాడట.. ఆమె దానికి ఒప్పుకుందట.. అందుకే డబ్బులు ఇచ్చాడట అని గుసగుసలాడుకున్నారు. ‘ఇక్కడికి ముద్దులు, టచ్‌ల కోసం వచ్చాడా అని కీర్తి అంటుంది. ఇలాంటి వాళ్లని పీకేస్తే బెటర్‌  అని ఆరోహి చెబుతోంది. ఇంకో చోట ఆదిరెడ్డి, గీతూ మాటలు మొదలుపెట్టారు. శ్రీ సత్య వెనకాలే తిరుగుతున్న అర్జున్‌పై సెటైర్లు వేశారు చంటి. వీళ్లకి ఓ టాస్క్‌ ఇవ్వాలి.. ఓ టేబుల్‌పై 24 గంటలు కదలకుండా చూస్తూ  కూర్చోవాలి అని టాస్క్‌ ఇవ్వాలి. ‘వీడు మాత్రం కదలడు.. వీడే గెలుస్తాడు. ఇంకో మూడు రోజులు ఉంటే బాగుండు అనుకుంటాడు అని సూర్య అంటాడు. 




Updated Date - 2022-10-01T21:29:26+05:30 IST