Bigg Boss 6: నన్ను అక్కడ టచ్‌ చేయకు!

ABN , First Publish Date - 2022-09-26T01:30:47+05:30 IST

బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఇప్పుడిప్పుడు కాస్త ఊపు అందుకుంటోంది. శనివారం 21వ ఎపిసోడ్‌ ఆసక్తికరంగా సాగింది. హౌస్‌లో ఏం జరుగుతోందో మన టీవీలో చూపించారు నాగార్జున. ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందనుకునే అర్జున్‌–శ్రీసత్య ఓ దగ్గర చేరారు.

Bigg Boss 6: నన్ను అక్కడ టచ్‌ చేయకు!

బిగ్‌బాస్‌ సీజన్‌ 6 (Biggboss 6)ఇప్పుడిప్పుడు కాస్త ఊపు అందుకుంటోంది. శనివారం 21వ ఎపిసోడ్‌ (212 episode)ఆసక్తికరంగా సాగింది.  హౌస్‌లో ఏం జరుగుతోందో మన టీవీలో చూపించారు నాగార్జున (King nagarjuna). ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందనుకునే అర్జున్‌–శ్రీసత్య ఓ దగ్గర చేరారు. శ్రీసత్య తన కష్టాలేవో చెబుతుంటే జైలులో ఉన్న అర్జున్‌ తన మీద చేయి వేసి జో కొట్టినట్లు చేస్తూ ఓదార్చబోయాడు. అంతే ఉగ్రరూపం దాల్చినట్లు టచ్‌ చేయకుండా మాట్లాడలేవా? అంటూ ఎదురుతిరిగింది. ‘నాపై చేయి వేయకు.. చేయి వేయకుండా మాట్లాడు’ (Dont touch me)అంటూ ఫైర్‌ అయింది. నేను మామూలుగానే అన్నాను కదా అని అర్జున్‌ (Arjun) అనగా ‘చిరాకులో ఉన్నప్పుడు నన్ను ముట్టుకుంటే ఆ చిరాకు ఇంకా పెరుగుతుంది’ అని డైలాగ్‌లు వేసింది శ్రీ సత్య. అంతే కాకుండా అదే విషయాన్ని రేవంత్‌తో చెప్పింది. అతనిపై అరిచానని బిల్డప్‌ ఇచ్చింది. 


ఆ తర్వాత రేవంత్‌.. గీతూ తీరు గురించి అర్జున్‌ కల్యాణ్‌ దగ్గర చెప్పుకొని భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘ఇంట్లో కొందరు ఎమోషన్‌ని యాక్టింగ్‌ అంటున్నారు. వాళ్లకి ఫ్యామిలీ విలువ ఏంటో తెలియదు అనుకుంటా. తల్లి ప్రేమ కన్నా కుక్క ప్రేమ గొప్పదని గీతు చెబుతోంది. ఇలాంటి వాళ్లని ఎందుకు పిలిచారో? ఇలాంటి హౌస్‌లో ఎందుకు ఉన్నానని సిగ్గుపడుతున్నా.. రివ్యూ సిస్టమ్‌ నుంచి బయటకు రావడంతో.. అంతా వీళ్లకే తెలుసనుకుంటున్నారు. అబ్బాయిలం మనకే చాలా ఎథిక్స్‌ ఉన్నాయి. ఈ అమ్మాయికి ఎథిక్స్‌ లేవు. ఆమెను చూస్తుంటే  ఛీ ఛీ ఇక్కడికి ఎందుకు వచ్చాం అనిపిస్తోంది’ అని రేవంత్‌ బాధ పడతాడు. అంతే కాదు  ‘గీతూ ఎంతకైనా తెగిస్తుంది.. ఏమైనా చేస్తుంది అని బయట విన్నాను. మరీ ఇంత దారుణంగా అని తెలియదు. ఆమెతో పోల్చుకుంటే ఆదిరెడ్డి చాలా బెటర్‌. ఆడియన్స్‌కి ఏం నచ్చుతుందో. నచ్చాలో వీళ్లే చెప్పేస్తున్నారు. దేవుళ్లా.. వీళ్లు. అసలు వీళ్లు మనకి పోటీ అనుకోకూడదు’ ఫీల్‌ అయ్యాడు. తదుపరి నాకు నోటి దూల ఉందా అని గీతూ ఆదిరెడ్డిని అడుగుతుంది. జైలులో ఉన్న అర్జున్‌ మొహమాటం లేకుండా నిలువెత్తునా నీకు నోటి దూల ఉంది అని చెబుతాడు. అయితే తను మాట్లాడేది నోటి దూల కాదని.. ఇనయ, రేవంత్‌ మాట్లాడేది నోటి దూల అని మరోసారి దురుసుగా మాట్లాడింది గలాటా గీతూ. 


Updated Date - 2022-09-26T01:30:47+05:30 IST