Bigg Boss6: లాంఛ్ ఈవెంట్‌కు ఇంత దారుణమైన టీఆర్పీనా?

ABN , First Publish Date - 2022-09-16T15:11:56+05:30 IST

తెలుగు బుల్లితెరపై కింగ్ నాగార్జున (King Nagarjuna) హోస్ట్‌గా రన్ అవుతున్న ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 6’ (Bigg Boss Telugu Season 6).. సెప్టెంబర్ 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. బాలాదిత్య

Bigg Boss6: లాంఛ్ ఈవెంట్‌కు ఇంత దారుణమైన టీఆర్పీనా?

తెలుగు బుల్లితెరపై కింగ్ నాగార్జున (King Nagarjuna) హోస్ట్‌గా రన్ అవుతున్న ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 6’ (Bigg Boss Telugu Season 6).. సెప్టెంబర్ 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. బాలాదిత్య, సింగర్ రేవంత్, సుదీపా (పింకీ), అభినయశ్రీ, చలాకీ చంటి వంటి కాస్త పేరున్న సెలబ్రిటీలతో పాటు మొత్తం  21 మంది కంటెస్టెంట్స్‌ ఈ సారి హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఒక్కొక్కరిని హౌస్‌లోకి పంపేముందు.. వారి చరిత్ర ఏమిటో చెబుతూ.. ఓ కార్డుని ఇచ్చి మరీ లోపలికి పంపించారు హోస్ట్ నాగార్జున. ఆ కార్డు ఏమిటనేది తర్వాత రివీల్ చేస్తామని చెప్పారు. అయితే ఈ లాంచింగ్ ఎపిసోడ్.. ఇప్పటి వరకు జరిగిన లాంఛింగ్ ఎపిసోడ్స్ అన్నింటికంటే దారుణమైన టీఆర్పీని నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ లాంఛింగ్ ఎపిసోడ్‌కు 8.8 టీఆర్పీ వచ్చినట్లుగా టాక్ నడుస్తోంది. ఇంతకు ముందు వాటితో పోల్చుకుంటే.. ఇది చాలా తక్కువ అనే చెప్పుకోవాలి.


ఇప్పటి వరకు పూర్తయిన 5 సీజన్ల లాంఛింగ్ ఎపిసోడ్ టీఆర్పీ పరిశీలిస్తే.. సీజన్ 1కి 16.8, సీజన్ 2కి 15.05, సీజన్ 3కి 17.92, సీజన్ 4కి 18.50, సీజన్ 5కి 15.70గా నమోదయ్యాయి. కానీ తాజాగా మొదలైన సీజన్ 6 ఎపిసోడ్ కేవలం 8.8 టీఆర్పీనే నమోదు చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఈ లాంఛింగ్ ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున గెటప్ గురించి కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఇంకాస్త హుందాగా ఆయన రెడీ అవ్వాల్సిందనేలా.. సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ కనిపించాయి.  అలాగే, ఓ ఐదారుగురు కంటెస్టెంట్స్ మినహా.. హౌస్‌లోకి అడుగుపెట్టిన చాలా మంది కంటెస్టెంట్స్ పెద్దగా ఎవరికీ తెలియదు. బహుశా.. ఇది కూడా వీక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయి ఉండవచ్చు. వీటన్నింటి కంటే ముఖ్యమైనది.. అదే రోజు ఇండియా-పాకిస్తాన్‌ (India-Pakistan) మధ్య క్రికెట్ మ్యాచ్ జరగడం. ఆసియా కప్‌కి సంబంధించి ఆరోజు చాలా కీలకమైన మ్యాచ్ జరిగింది.. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్‌ని తిలకించేందుకు జనాలు టీవీలకు అతుక్కుపోవడంతో.. ‘బిగ్ బాస్’ (Bigg Boss)ని చూసే వారే కరువయ్యారు. అందుకే ఈ సీజన్ లాంఛింగ్ ఎపిసోడ్‌కి ఇంత దారుణమైన టీఆర్పీ నమోదైందనేలా టాక్ వినిపిస్తోంది.

Updated Date - 2022-09-16T15:11:56+05:30 IST