Bigg Boss 6: ఇలాంటి సమయంలో వీరులంతా తరుచుగా చెప్పే మాటేంటో తెలుసా?

ABN , First Publish Date - 2022-09-01T03:41:18+05:30 IST

‘మీ ఇంటిపైనే కాదు.. మా ఇంటిపై కూడా కాస్త కన్నేసి ఉంచండి’ అని మళ్లీ కింగ్ నాగార్జున (King Nagarjuna) చెబుతుంటే వినాలని ఉందా.. అయితే లేటేందుకు.. ఆ గడియలు వచ్చేస్తున్నాయి. బుల్లితెరపై

Bigg Boss 6: ఇలాంటి సమయంలో వీరులంతా తరుచుగా చెప్పే మాటేంటో తెలుసా?

‘మీ ఇంటిపైనే కాదు.. మా ఇంటిపై కూడా కాస్త కన్నేసి ఉంచండి’ అని మళ్లీ కింగ్ నాగార్జున (King Nagarjuna) చెబుతుంటే వినాలని ఉందా.. అయితే లేటేందుకు.. ఆ గడియలు వచ్చేస్తున్నాయి. బుల్లితెరపై ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి బిగ్‌బాస్ (Bigg Boss) సిద్ధమయ్యాడు. సెప్టెంబర్ 4న సీజన్ 6‌కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే విడుదలైన నాగార్జున ప్రోమోస్.. ఈ సారి ఎంటర్‌టైన్‌మెంట్ మాములుగా ఉండదనేలా చెప్పకనే చెప్పేస్తున్నాయి. మరోవైపు పలానా వారు కంటెస్టెంట్స్ అంటూ.. అప్పుడే ‘రగడ’ మొదలైంది. ఈసారి కాస్త పేరున్న వారే హౌస్‌లోకి వెళ్లబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తుండటంతో.. నాగ్ చెబుతున్నట్లుగా ఈ సీజన్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా అయ్యేట్టే కనబడుతోంది.


ఇక.. తాజాగా విడుదల చేసిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 (Bigg Boss Telugu season 6) ఫస్ట్ గ్లింప్స్ చూస్తుంటే.. కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపించే ఈవెంట్‌ని భారీ స్థాయిలో నిర్వహించబోతున్నట్లుగా క్లారిటీ కూడా వచ్చేసింది. ఈ గ్లింప్స్‌లో ‘లైఫ్‌లో ఏ మూమెంటైనా బిగ్‌బాస్ తర్వాతే’ అంటూ నాగార్జున ఎంట్రీ తర్వాత.. హౌస్‌ని చూపించి.. ఆ తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు ఏ స్థాయిలో డిజైన్ చేశారో.. జస్ట్ అలా పరిచయం చేశారు. ఇక ‘విక్రమ్’ (Vikram) సినిమాలోని ‘ఇలాంటి సమయంలో వీరులంతా తరుచుగా చెప్పే మాటేంటో తెలుసా?’ అంటూ కమల్ వాయిస్‌లో వచ్చిన డైలాగ్ తర్వాత కింగ్ నాగార్జున ఇచ్చిన మాస్ ఎంట్రీ అదిరిపోయింది. దీంతో ఈసారి కంటెస్టెంట్సే కాదు.. కంటెంట్ కూడా కేక అనే రేంజ్‌లో ఉండబోతుందనేలా.. హింట్ ఇచ్చేశారు. కింగ్‌కి కూడా ఈసారి కాస్త ఎక్కువే స్పేస్ ఇచ్చినట్లుగా ఈ ప్రోమోస్ చూస్తుంటే తెలిసిపోతుంది. మొత్తంగా చూస్తే.. గత సీజన్ల కంటే కూడా.. ఈసారి బిగ్‌బాస్ ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడనేది మాత్రం.. ప్రేక్షకులలోకి వెళ్లిపోయింది. అదేంటనేది తెలియాలంటే.. ఇంకా 4 డేస్ వెయిట్ చేయాల్సిందే.



Updated Date - 2022-09-01T03:41:18+05:30 IST