BiggBoss 6: టైటిల్ అతనిదే.. సర్‌ప్రైజ్ ఇచ్చిన హౌస్!
ABN , First Publish Date - 2022-09-30T23:42:44+05:30 IST
‘నీ ఎగ్టైట్‌మెంట్ ఈ పద్మశ్రీకి నచ్చింది.. పద్మశ్రీనా.. అంటే అప్పుడే మీకు... ఎవరు ఇవ్వలేదు.. నేనే పెట్టుకున్నా.. స్ర్కీన్ నేమ్. పద్మశ్రీగారు అందరూ సిగ్గు రేంజ్‌లో మీ చేత పెర్‌ఫార్మెన్స్ చేయించి మీ స్ర్కీన్ నేమ్‌ను..
‘నీ ఎగ్టైట్‌మెంట్ ఈ పద్మశ్రీకి నచ్చింది..
పద్మశ్రీనా.. అంటే అప్పుడే మీకు...
ఎవరు ఇవ్వలేదు.. నేనే పెట్టుకున్నా.. స్ర్కీన్ నేమ్.
పద్మశ్రీగారు అందరూ సిగ్గు రేంజ్‌లో మీ చేత పెర్‌ఫార్మెన్స్ చేయించి మీ స్ర్కీన్ నేమ్‌ను.. మీ రియల్ నేమ్ ముందు పెట్టేలా చేస్తాను చూడండి’. ‘దూకుడు’ సినిమాలో మహేశ్‌బాబు – బ్రహ్మానందం మధ్య నడిచే సంభాషణ ఇది. ప్రేక్షకులకు ఎంతో హాస్యాన్ని పంచింది. ఇలాంటి డైలాగే ఒకటి ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో పేలింది.
తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో సింగర్ రేవంత్ (Revanth)‘నవ్వండ్రా.. నవ్వండి.. బిగ్ బాస్ సీజన్ 6(Biggboss6) టైటిల్‌ని ఇదిగో ఈ చేతులతోనే ఎత్తుతా.. అప్పుడు మీ నవ్వులు ఏమౌతాయో చూస్తా’ అన్నాడు. అంటే బిగ్‌బాస్ టైటిల్ రేవంత్‌దే అని ఫిక్స్ అయిపోయాడు. తనకున్న ఫేం, ఆట మీద నమ్మకంతోనే ఆయన ఈ మాట అన్నాడని ఆయన అభిమానులు చెబుతున్నారు. హౌస్‌లో ఓ కంటెస్టెంట్‌ని ఎత్తాలన్నా.. అమాంతంగా కింద పడేయాలన్నా అది బిగ్‌బాస్ చేతిలోనే ఉంటుంది. మొదటి నుంచి రేవంత్ ఆట కూడా బాగానే ఉంది. అలాగే సింగర్‌గా ఆయనకు బయట ఫాలోయింగ్ కూడా ఉంది. ప్రతి ప్రోమోలోనూ రేవంత్ కనిపిస్తున్నాడు. అదే నమ్మకంతో రేవంత్ బిగ్‌బాస్ టైటిల్ నాదే అని తాజా ఎపిసోడ్‌లో ప్రకటించాడు. అయితే రేవంత్‌పై ఇంటి సభ్యుల్లో నెగటివిటీ ఎంత ఉందో.. పాజిటివిటీ కూడా అంతే ఉంది. అతను ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఇగో కూడా ఎక్కువే. అయినా ఆటను మాత్రం తనదైన శైలిలో ఆడుతున్నాడు. ఓటింగ్‌లో కూడా టాప్‌లో ఉంటున్నాడు. గురువారం ఎపిసోడ్‌లో రేవంత్‌కి ఫుల్ పాజిటివ్ ఫుటేజ్ వచ్చింది. అది ఫ్యామిలీ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.
రేవంత్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టేటప్పటికి ఆయన భార్య అన్విత గర్భవతి. పక్కన ఉండాల్సి సమయంలో రేవంత్ బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. చిన్నతనం నుంచి ‘నాన్న’ అనే పిలుపునకు నోచుకోని అతను ఎప్పుడెప్పుడు ‘నాన్న’ అనిపించుకుందామా అని ఆతురతగా ఎదురుచూస్తున్నారు. గతవారం రేవంత్ భార్యకు సీమంతం జరిగింది. ఆయన బిగ్ బాస్ హౌస్‌లో ఉండటం వల్ల సీమంతంలో పాల్గొనలేకపోయాడు. కానీ రేవంత్‌కి బిగ్‌బాస్ సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. తన ఇంట్లో జరగాల్సిన సీమంత వేడుకను బిగ్‌బాస్ హౌస్‌లో జరిపించారు. రేవంత్ ఒక్కడినే గార్డెన్ ఏరియాలోకి పిలిచిన బిగ్ బాస్.. ‘మునుపటి వారం మీ భార్య సీమంతం జరిగింది.. ఆ వేడుకలో మీరు స్వయంగా పాలుపంచుకోలేకపోయిన కారణంగా ఆ తీపి క్షణాలను మీకు చూపించాలని అనుకుంటున్నాం’ అంటూ అన్విత సీమంత వేడుక వీడియో చూపించారు బిగ్‌బాస్. చిన్ని చిన్ని ఆశలేవో రెక్కలిప్పుకున్నవీ.. అంటూ వచ్చే సాంగ్‌తో ఆ వీడియో మొదలైంది. ఆ వీడియో చూస్తున్నంత ేసపు రేవంత్ కళ్లల్లో నీళ్లు ఆగలేదు. ఆడియన్స్‌ని సైతం ఆ వీడియో భావోద్వేగానికి గురి చేసింది. నిండు గర్భిణిగా ఉన్న భార్యను చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు రేవంత్. ‘ఇది చాలు బిగ్ బాస్.. ఇక్కడకొచ్చి గెలిచినంత ఆనందంగా ఉంది. పక్కనుంటే బాగుండేది.. నా భార్యకి ఫ్రీ డెలివరీ అవ్వాలి.. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండాలి.. కష్టపడి ఆడి గెలిచి.. ఆ కప్పు తీసుకుని వెళ్లి నా బేబీకి ఇవ్వాలి. దాని కోసం ఎత కష్టమైనా పడతా’’ అని అన్నాడు రేవంత్.
అయితే బిగ్‌బాస్ రేవంత్ మరో అవకాశం ఇచ్చారు. తన ఆశీస్సులు బిగ్ బాస్ హౌస్ నుంచి అందించే అవకాశం కల్పిస్తూ.. స్వీట్స్, పళ్లు, ఇతర వస్తువుల్ని మీ భార్యకు పంపిస్తాం’’ అని అన్నారు బిగ్ బాస్. దీంతో రేవంత్ వెక్కి వెక్కి ఏడ్చాడు. అనంతరం ఖాళీ పళ్లెంలో స్వీట్స్, పూలు, పళ్లు సమకూర్చి వీడియోలో కనిపిస్తున్న తన భార్యకి బొట్టు పెట్టి, గంధం పూశాడు. అక్షంతలు వేశాడు రేవంత్. తన భార్య కోసం చక్కని పాట పాడాడు. సింగర్ రేవంత్ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఈ మధుర జ్ఞాపకం పది బిగ్‌బాస్ టైటిళ్లతో సమానం అని రేవంత్ చెప్పారు. ఈ జ్ఞాపకం.. అతనికి పది బిగ్ బాస్ టైటిల్స్‌తో సమానం అనేట్టు చేశారు. అయితే తాజా ఎపిసోడ్ రేవంత్‌కు మంచి మైలేజ్ ఇచ్చింది. ఆట, ఫాలోయింగ్‌ను బట్టి తాను అన్నట్లుగానే రేవంత్ బిగ్‌బాస్ టైటిల్ కొట్టే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.