జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్(రౌద్రం, రణం, రుధిరం)’. దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు కొత్త రికార్డులను సృష్టించింది. ఇండస్ట్రీలకు అతీతంగా అనేక మంది ఈ మూవీని ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా బిగ్ బాస్ ఓటీటీ ఫేం, టీవీ నటి ఉర్ఫీ జావేద్ ఈ సినిమా గురించి కామెంట్ చేసింది.
రామ్ చరణ్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడని ఉర్ఫీ జావేద్ తెలిపింది. ‘కేజీఎఫ్’ చిత్రం గురించి కూడా మాట్లాడింది. ‘కేజీఫ్: చాప్టర్-1’ని చూడలేదని చెప్పింది. తప్పకుండా మూవీని చూస్తానని వివరించింది. దక్షిణాది సినిమాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘సౌత్ చిత్రాలు అద్భుతంగా ఉంటాయి. అక్కడ చాలా మంచి నటులు ఉన్నారు. నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. అతడు హ్యాండ్సమ్గా ఉంటాడు’’ అని ఉర్ఫీ జావేద్ చెప్పింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మార్చి 25న విడుదలైంది. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, అలియా భట్, ఒలివియా మోరిస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.900కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది.