వాటినుంచి బయట పడడానికి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా: బిగ్‌బాస్ బ్యూటీ

ABN , First Publish Date - 2021-12-27T20:32:50+05:30 IST

కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ ఓటీటీ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న నటి ఉర్ఫీ జావేద్. ఇటీవల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా..

వాటినుంచి బయట పడడానికి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా: బిగ్‌బాస్ బ్యూటీ

కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ ఓటీటీ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న నటి ఉర్ఫీ జావేద్. ఇటీవల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్న ఈ బ్యూటీ తన విచిత్రమైన డ్రెసింగ్‌తో ట్రోలింగ్ గురవుతూ ఉంటుంది. తాజాగా ఓ పిక్‌ని పోస్ట్ చేసిన ఈ భామ తన జీవితంలో జరిగిన కొన్ని ఇబ్బందికర పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది.


ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆ పిక్‌లో ఉర్ఫీ వైట్ టై డై బ్రాతో పాటు దానికి సరిపోయే ప్యాంటు వేసుకుని ఉంది. అయితే దాని కంటే ఎక్కువగా ఆమె రాసిన క్యాప్షన్ ఈ భామ ఫాలోవర్స్‌ని బాగా ఆకర్షించింది. అందులో.. ‘నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యానో మీకు తెలుసా? కనీసం వాటిని లెక్క పెట్టలేను కూడా! నా జీవితంలో జరిగిన గందరగోళాల నుంచి బయటపడడానికి ఉన్న  ఏకైక మార్గం ఆత్మహత్య చేసుకోవడమేనని కొన్నిసార్లు భావించాను. నేను చాలా తీవ్రంగా నష్టపోయాను. విఫలమైన కెరీర్, విఫలమైన సంబంధాలు, డబ్బు లేకపోవడం వంటి వాటితో ఓడిపోయిన దానిలా భావించుకున్నాను. జీవించడానికి అర్హత లేదని అనుకున్నా. ఇప్పటికీ నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు. మంచి కెరీర్ లేదు. ఒంటరిగానే ఉన్నాను కానీ నాలో ఆశ అలాగే ఉంది.


నేను ఈ రోజు జీవించి ఉన్నానంటే (నన్ను నమ్మండి.. జీవితంలో జరిగిన సంఘటనలతో చాలా సార్లే చనిపోయినంత పనైంది) కారణం నేను ఎక్కడ ఆగకపోవడమే. నేను కష్టపడుతూనే ఉన్నాను. ఇంకా కష్టపడుతూనే ఉంటాను. నేను ఉండాలనుకున్న చోట ఉండకపోవచ్చు కానీ కనీసం ఆ దారిలో ఉన్నాను. సంవత్సారాంతంలో నాకు ఎనర్జీ ఇచ్చే మాటలు ఏంటంటే.. లేవండి, పోరాడండి, పునరావృతం చేయండి. చుట్టూ ఉన్న పరిస్థితుల కంటే మీరు చాలా బలంగా ఉన్నార’ని రాసుకొచ్చింది ఈ బ్యూటీ.



Updated Date - 2021-12-27T20:32:50+05:30 IST