Samantha తో పోల్చుకుంటూ Urfi Javed ఎమోషనల్ కామెంట్స్.. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ..

ABN , First Publish Date - 2022-05-07T00:14:46+05:30 IST

బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొని ఫేమ్ సంపాదించుకున్న అందాల భామ ఉర్పీ జావేద్. ఫ్యాషన్ దుస్తులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఉర్పీ ధరించిన డ్రెస్‌ను చూసి కొన్నిసార్లు నెటిజన్స్ కూడా ట్రోల్ చేశారు.

Samantha తో పోల్చుకుంటూ Urfi Javed ఎమోషనల్ కామెంట్స్.. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ..

బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొని ఫేమ్ సంపాదించుకున్న అందాల భామ ఉర్పీ జావేద్. ఫ్యాషన్ దుస్తులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఉర్పీ ధరించిన డ్రెస్‌ను చూసి కొన్నిసార్లు నెటిజన్స్ కూడా ట్రోల్ చేశారు. ఈ విషయంపై తాజాగా సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించింది. కొంత మంది రెండు నాలుకల ధోరణీని అవలంభిస్తున్నారని, పనిగట్టుకుని తననే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించింది.


ఉర్పీ జావేద్‌ను ప్రస్తావిస్తూ ఓ వెబ్‌సైట్‌లో కథనం వచ్చింది. ‘దోమతెర కంటే పారదర్శకమైన డ్రెస్‌ను ధరించిన ఉర్పీ.. భయానక దుస్తులపై ప్రజల ఆగ్రహం’ అంటూ ఆ వెబ్‌సైట్ కథనానికీ శీర్షిక పెట్టింది. దీంతో ఉర్పీ జావేద్‌కు చిర్రెత్తుకొచ్చింది. సోషల్ మీడియాలో ఆ స్టోరీ ఫొటోను షేర్ చేసింది. టాలీవుడ్ నటి సమంత రుత్ ప్రభు అటువంటి డ్రెస్‌ను వేసుకున్న ఫొటోను ఉర్పీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘‘సమంత అటువంటి దుస్తులను ధరిస్తే బోల్డ్‌నెస్‌తో కుర్రాళ్ల మతిని పొగొట్టిందన్నారు. నేను మాత్రం అదే విధమైన డ్రెస్‌ను వేసుకుంటే ఈ విధంగా హెడ్డింగ్ పెట్టారు. కొన్ని వెబ్‌సైట్స్ రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తున్నాయి’’ అని ఉర్పీ జావేద్ చెప్పుకొచ్చింది.  కొన్ని రోజుల క్రితం ఈ అందాల భామ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌పై స్పందించింది. 


సోషల్ మీడియా ట్రోలింగ్‌ను మనస్సులోకి తీసుకోనని ఉర్పీ జావేద్ చెప్పింది. ‘‘నేను అటువంటి విషయాలను పరిగణనలోకి తీసుకోను. నన్ను ఇష్టపడని ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు ఇష్టపడకపోయినా నాకు నష్టం ఏం లేదు. కొంత మంది వారి సొంత పిల్లల్నే ఇష్టపడరు, అటువంటి వారు నన్నేలా ఇష్టపడతారు? ప్రతి ఒక్కరూ నన్ను అభిమానించాలని కోరుకోవడం అంత మంచిది కాదు. ప్రజలు నన్ను ఇష్టపడినా, ఇష్టపడకపోయినా నేనేమీ అనను’’ అని ఉర్పీ జావేద్ స్పష్టం చేసింది. ఇక కెరీర్ విషయానికీ వస్తే.. ఈ అందాల భామ కొన్ని రోజుల క్రితం ఓ మ్యూజిక్ వీడియోలో నటించింది. తన రూమర్డ్ లవర్ కున్వర్‌తో అందులో సందడి చేసింది. టెలివిజన్‌లోను పలు షోలు చేసింది. ‘బడే బయ్యాకీ దుల్హనియా’, ‘మేరీ దుర్గ’ వంటి ప్రాజెక్టుల్లో కనిపించింది.

Updated Date - 2022-05-07T00:14:46+05:30 IST