పొట్టి డ్రెస్సులేసి ఐటమ్ సాంగ్స్‌‌ను మీవాళ్లు తీస్తారుగా.. పర్లేదా..?.. తనపై కామెంట్స్‌కు Urfi Javed స్ట్రాంగ్ కౌంటర్..

ABN , First Publish Date - 2022-04-01T02:20:40+05:30 IST

బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొని ఫేమ్ సంపాదించుకున్న అందాల భామ ఉర్ఫీ జావేద్

పొట్టి డ్రెస్సులేసి ఐటమ్ సాంగ్స్‌‌ను మీవాళ్లు తీస్తారుగా.. పర్లేదా..?.. తనపై కామెంట్స్‌కు Urfi Javed స్ట్రాంగ్ కౌంటర్..

బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొని ఫేమ్ సంపాదించుకున్న అందాల భామ ఉర్ఫీ జావేద్. తాజాగా ఉర్ఫీ ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఆ సందర్భంగా బిల్డింగ్ గేటు ముందు నిల్చుని ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చింది. అయితే, ఆ క్రమంలో భవనం ముందున్న సెక్యూరిటీ గార్డుతో వాగ్వాదానికి దిగడంతో ఆమెతో సహా ఫొటోగ్రాఫర్లను ఎవ్వర్నీ లోనికి అనుమతించలేదు. ఈ ఘటనను అంతా ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ సోదరి ఫరా ఖాన్ అలీ దృష్టికి వచ్చింది. ఆమె ఉర్ఫీ డ్రెస్సింగ్ బాగా లేదంటూ కామెంట్ చేసింది.  


ఉర్ఫీ జావేద్ సెక్యూరిటీ గార్డుతో వాగ్వాదానికి దిగిన వీడియో కింద ఫరా ఖాన్ అలీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘‘అసభ్యకర వస్త్రధారణ చేసిన ఈ అమ్మాయికి గట్టిగా చీవాట్లు పెట్టాలి. ఇలా అంటున్నందుకు నేను చింతిస్తున్నాను. కానీ, జనం తనని చూసి నవ్వుకుంటున్నారు. ఆమె వారంతా తన డ్రెస్సింగ్ చూసి మెచ్చుకుంటున్నారని భ్రమిస్తోంది. ఎవరైనా తనతో అసలు విషయం చెబితే బావుండు... ’’ అని ఫరా ఘాటుగా కామెంట్ చేసింది. ఉర్ఫీ కూడా అంతే ఘాటుగా ఇన్‌స్టాగ్రామ్‌లో రిప్లై ఇచ్చింది. ‘‘మంచి డ్రెస్సింగ్ అంటే ఏంటీ..? దాని అర్థం నాకు వివరించండి. నేను ధరించిన దుస్తులను అందరూ ఇష్టపడరని నాకు తెలుసు. ప్రజల అభిప్రాయాలతో నాకు పనిలేదు. నేను వారి కోసం జీవించడం లేదు. డిజైనర్ దుస్తులు వేసుకుంటేనే మంచివి ధరించనట్టా? మీ బంధువులు నటించిన కొన్ని చిత్రాల్లో, నిర్మించిన సినిమాల్లో మహిళలు ఐటం సాంగ్స్‌లో పొట్టిదుస్తులు ధరించారు. మహిళలను ఐటం నంబర్స్‌గా చూపడం సమ్మతమేనా?’’ అని ఉర్ఫీ జావేద్ ఓ పోస్ట్ పెట్టింది. 


ఉర్ఫీ జావేద్ అంతటితో ఆగకుండా మరో పోస్ట్ కూడా పెట్టింది. ‘‘ప్రజలు మెచ్చుకోవడం లేదు కాబట్టి నేను ధరించే దుస్తులను మార్చుకోమని చెబుతున్నారు. మీ కుటుంబం గురించి ప్రజలు బయట ఎన్నో విషయాలు మాట్లాడుతుంటారు. ఆ విషయాలను విని మీ కుటుంబం ఏమయినా మారుతుందా? బాలీవుడ్ స్టార్ కిడ్స్ ఇటువంటి దుస్తులను ధరించి ఎన్నో సార్లు ట్రోల్స్ బారినపడ్డారు. నాకు ఇచ్చినట్లుగా వారికి మీరు సలహాలు ఇవ్వటం నేనెప్పుడూ చూడలేదు’’ అంది ఉర్ఫీ జావేద్.

Updated Date - 2022-04-01T02:20:40+05:30 IST