ఇండో అమెరికన్ సింగర్‌తో డేటింగ్ చేస్తోన్న ఉర్పీ జావేద్..!

ABN , First Publish Date - 2022-02-18T00:01:02+05:30 IST

బోల్డ్ అవుట్‌ఫిట్స్ తరచూ ధరిస్తూ బాలీవుడ్‌లో తనకంటూ

ఇండో అమెరికన్ సింగర్‌తో డేటింగ్ చేస్తోన్న ఉర్పీ జావేద్..!

బోల్డ్ అవుట్‌ఫిట్స్ తరచూ ధరిస్తూ బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న సుందరి ఉర్పీ జావేద్. ఎప్పుడూ మాటలను తూటల్లా పేలుస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. కానీ, ఈ సారి మాత్రం ఆమె వ్యక్తిగత కారణాల రీత్యా పతాక శీర్షికలకెక్కింది. ఇండో- అమెరికన్ సింగర్ కున్వర్‌తో ఆమె డేటింగ్ చేస్తోందని బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  


ఉర్పీ జావేద్‌తో తీసుకున్న ఫొటోను సింగర్ కున్వర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘‘ఇక్కడ ఏదో జరుగుతోంది’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అతడి పోస్ట్‌ను ఉర్పీ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ‘‘నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు’’ అంటూ ఆమె చెప్పింది. దీంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు కొట్టడం ప్రారంభమయ్యాయి. వాలంటైన్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో బ్యాక్‌లెస్‌గా కనిపించింది. అందరికి వాలంటైన్స్ డే శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఆ పోస్ట్‌కు కున్వర్ స్పందించాడు. ‘హ్యాపీ వాలంటైన్స్ డే ఉర్పీ జీ’ అంటూ కామెంట్ చేశాడు. ఫొటోకు కామెంట్ చేయడంతోనే ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. ఈ జంట రిలేషన్ షిప్‌లో ఉందని వార్తలు హల్‌చల్ చెయ్యడం ప్రారంభించాయి. కాగా, కంగన హోస్ట్ చేయబోతున్న ‘లాకప్ షో’ కోసం ఉర్పీని సంప్రదించారని తెలుస్తోంది. ఈ షోలో ఆమె పాల్గొంటుందో లేదో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. 



Updated Date - 2022-02-18T00:01:02+05:30 IST