Bigg Boss NonStop: ఈ వారం మిత్రా శర్మ రఫ్పాడించింది

ABN , First Publish Date - 2022-05-15T21:40:13+05:30 IST

బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌ (Bigg Boss NonStop) తెలుగు రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొంది. ఇంటి సభ్యుల్లో అందరి దృష్టి టాప్5‌లో చేరడంపైనే ఉంది. ఈ వారం ఇంటి సభ్యుల్లో మొదటి నుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకుంటున్న మిత్రా శర్మ(Mitraaw Sharma) అందరినీ

Bigg Boss NonStop: ఈ వారం మిత్రా శర్మ రఫ్పాడించింది

బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌ (Bigg Boss NonStop) తెలుగు రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొంది. ఇంటి సభ్యుల్లో అందరి దృష్టి టాప్5‌లో చేరడంపైనే ఉంది. ఈ వారం ఇంటి సభ్యుల్లో మొదటి నుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకుంటున్న మిత్రా శర్మ(Mitraaw Sharma) అందరినీ ఆకర్షించింది. ‘శేఖర్’ (Shekar) సినిమా ప్రమోషన్స్ నిమిత్తమై హీరో రాజశేఖర్ (Rajasekhar), ఆయన సతీమణి, దర్శకురాలు జీవిత (Jeevitha).. బిగ్‌బాస్‌ ఇంటిలోకి అడుగుపెట్టి.. కంటెస్టెంట్లకు రకరకాల టాస్క్‌లు ఇస్తూ.. వారిలోని ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఒక యాక్టింగ్ స్కూల్‌లో సీటు వస్తే ఎలా స్పందిస్తారు.. సీటు రాకపోతే ఎలా ఫీలవుతారు అనే థీమ్ ఆధారంగా నటించి చూపమని రాజశేఖర్ కోరారు. అందరూ చక్కగానే నటించారు.. కానీ మిత్రా శర్మ తనదైన శైలిలో రకరకాల భావాలు పలికిస్తూ నటించి చూపించారు. ఓ దశలో భావోద్వేగంతో మిత్రా శర్మ నటించి చూపించిన తీరు చూసి జీవిత, రాజశేఖర్ మాత్రమే కాకుండా ఇంటి సభ్యులు కూడా ఎమోషనల్ అయ్యారు. అనంతరం మిత్రా శర్మను జీవిత, రాజశేఖర్ అభినందిస్తూ.. ఆమె నటనపై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ వారం ఆమె హైలెట్‌గా నిలిచింది.  


మిత్రా శర్మ గురించి చెప్పాటంటే.. యువ తారగా, నిర్మాతగా, సమాజసేవలో భాగమైన ఆమె.. బిగ్‌బాస్‌లోకి వచ్చి అనూహ్యంగా ఆదరణను సంపాదించుకుంది. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లో సాధారణమైన కంటెస్టెంట్‌గా వచ్చిన మిత్రా.. ఇప్పుడు అసాధారణ రీతిలో ఇంటి సభ్యులకు బలమైన ప్రత్యర్థిగా మారింది. గత 70 రోజులకుపైగా జరిగిన ఈ ప్రయాణంలో రకరకాల టాస్క్‌లలో ఆమె తన ప్రతిభను చాటింది. ప్రత్యర్థుల ఆరోపణలకు ధీటుగా సమాధానం ఇస్తూ.. బలమైన ప్లేయర్‌గా మారి.. ఇప్పుడు టాప్ స్థానం కోసం పోటీ పడుతోంది.


ఇక బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ఈ ఆదివారం టాప్ 5 కంటెస్టెంట్‌లు ఎవరో తేలిపోనున్నది. వారాంతంలో హోస్ట్ నాగార్జున (Nagarjuna) వచ్చి తుదివారానికి, టైటిల్ రేసుకు పోటీపడే అభ్యర్థులను నిర్ణయిస్తారు. ఇలాంటి నేపథ్యంలో ఈ వారం హైలెట్‌గా నిలిచిన మిత్రాశర్మ టాప్ 5లో చోటు సంపాదించడానికి అన్ని అర్హతలను సాధించడమే కాకుండా.. టైటిల్ విన్నర్ రేసులోకి కూడా వెళ్లిపోయింది. మరికొన్ని రోజుల్లో ముగియనున్న ఈ షోలో.. వారానికి ఒకరు హైలెట్ అవుతూ.. టైటిల్ రేసులోకి దూసుకొస్తున్నారు. ఇక అసలు విజేత ఎవరు అనేది తెలియాలంటే ఇంకో వారం వేచి చూడక తప్పదు.

Updated Date - 2022-05-15T21:40:13+05:30 IST