Urfi Javed: ఎనిమిదేళ్లుగా అప్పుల్లోనే ఉన్నా.. ఆ షోలో వేసుకున్న డ్రెస్సులు కూడా అప్పు చేసి కొన్నవే..

ABN , First Publish Date - 2022-09-08T16:20:22+05:30 IST

ఆ షో నుంచి బయటికి వచ్చిన ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ని పెంచుకుంటూ పోతోంది...

Urfi Javed: ఎనిమిదేళ్లుగా అప్పుల్లోనే ఉన్నా.. ఆ షోలో వేసుకున్న డ్రెస్సులు కూడా అప్పు చేసి కొన్నవే..

హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ (Bigg Boss OTT)తో పాపులారిటీ సాధించిన నటి ఉర్ఫీ జావేద్ (Urfi Javed). ఆ షో నుంచి బయటికి వచ్చిన ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్స్‌ని పెంచుకుంటూ పోతోంది. ఏ విషయం గురించైనా బోల్డ్‌గా ఉంటూ.. ఎటువంటి భయం, మొహమాటం లేకుండా మాట్లాడడం ఈ నటికి అలవాటు. అందుకే.. డిఫరెంట్ ఫ్యాషన్, డ్రెస్సింగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేస్తూ పలుమార్లు విమర్శల పాలైంది. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తన పంథాని కొనసాగిస్తోంది. అంతేకాకుండా.. తనకి సంబంధించిన విషయాలను చాలా ఓపెన్‌గా అందరితో పంచుకుంటూ ఉంటుంది.


తాజాగా సైతం..  ప్రముఖ యాంకర్, జర్నలిస్ట్ సిద్ధార్థ్ కానన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చింది. 


ఉర్ఫీ మాట్లాడుతూ.. ‘నేను గత 8 సంవత్సరాలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాను. వాస్తవానికి.. భారీ అప్పుల్లో మెడ లోతు వరకూ మునిగిపోయాననే చెప్పాలి. అది ఎంతా ఉందంటే.. బిగ్ బాస్ OTTలోకి ప్రవేశించడానికి నా దగ్గర డబ్బు లేదు. దాంతో ఆ షోకి వెళ్లేముందు నాకు కావాల్సిన దుస్తువులను సైతం అప్పు చేసి కొనాల్సి వచ్చింది’ అని ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. అయితే.. ఈ షోలో కేవలం వారం రోజుల మాత్రమే ఉన్న ఉర్ఫీ ఎలిమినేట్ అయ్యింది. దీంతో ఆ షో వల్ల కూడా ఎక్కువగా సంపాదించలేకపోయింది. కానీ.. ఆ షోలో వచ్చిన పాపులారిటీతో ఇన్‌స్టాగ్రామ్‌లో 35 లక్షలకు పైగా ఫాలోవర్స్‌ని పొందింది.

Updated Date - 2022-09-08T16:20:22+05:30 IST