Bigg Boss 6: ఎంటర్‌టైన్మెంట్‌కి అడ్డా ఫిక్స్..

ABN , First Publish Date - 2022-09-04T18:53:19+05:30 IST

బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss 6) కి అడ్డా ఫిక్సైంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ బిగ్ ఎంటర్‌టైన్మెంట్ షో స్టార్ మా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నందు ప్రసారం కాబోతుంది.

Bigg Boss 6: ఎంటర్‌టైన్మెంట్‌కి అడ్డా ఫిక్స్..

బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss 6) కి అడ్డా ఫిక్సైంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ బిగ్ ఎంటర్‌టైన్మెంట్ షో స్టార్ మా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నందు ప్రసారం కాబోతుంది. దీనికోసం సర్వం సిద్ధమయింది. కింగ్ నాగార్జున (Nagarjuna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గత సీజన్స్ కంటే ఈ సీన్‌లో ఎంటర్‌టైన్మెంట్ పీక్స్‌లో ఉండబోతుందని నిర్వాహకులు చెబుతున్నారు. టాలీవుడ్‌లో పెద్ద సక్సెస్ అయిన ఈ రియాలిటీ షో కోసం కోట్లాదిమంది ఎదురుచూస్తున్నారు.


ఇక షో గురించి నాగార్జున ట్వీట్ చేశారు. మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ 6తో మీ ముందుకు రాబోతున్నానని పేర్కొన్నారు. ఇక ఈ సీజన్‌లో గీతూ రాయల్‌, ఆదిరెడ్డి, శ్రీహాన్‌, యాంకర్‌ నేహా చౌదరి, ఆర్జే సూర్య, చలాకీ చంటి, బాలాదిత్య, సింగర్‌ రేవంత్‌, నటి సుదీప, యాంకర్‌ ఆరోహీ రావ్‌, శ్రీ సత్య, కీర్తి, ఇనయా సుల్తానా, ఫైమా, నటి వసంతి, అర్జున్‌, రాజశేఖర్‌, రియల్‌ కపుల్‌ రోహిత్‌, మరీనా తదితరుల పేర్లు కంటెస్టెంట్‌లుగా హౌస్‌లోకి వెళ్లబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కరు కొడుతున్నాయి. 


ఇప్పటివరకు నాగార్జున వరుసగా మూడు సీజన్స్‌లో అలరించారు. ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన బిగ్ బాస్ షోకి కూడా ఆయన తనదైన శైలిలో అలరించారు. మరి ఈ సీజన్‌లో ఎంత వరకు ఆకట్టుకుంటారో చూడాలి.  కింగ్ ఇలా బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వూవహరిస్తూనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది. 



Updated Date - 2022-09-04T18:53:19+05:30 IST