Bigg Boss 6: హౌస్‌లో రేవంత్.. భార్య సీమంతంలో ఎలా పాల్గొన్నాడంటే..

ABN , First Publish Date - 2022-09-29T20:05:16+05:30 IST

రెండు ఆత్మలు ఏకమైనప్పుడు దూరం పెద్దగా సమస్య కాదని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇది నిజమని బిగ్ బాస్ కంటెస్టెంట్,

Bigg Boss 6: హౌస్‌లో రేవంత్.. భార్య సీమంతంలో ఎలా పాల్గొన్నాడంటే..

రెండు ఆత్మలు ఏకమైనప్పుడు దూరం పెద్దగా సమస్య కాదని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇది నిజమని బిగ్ బాస్ కంటెస్టెంట్, సింగర్ రేవంత్ విషయంలో రుజువైంది. తల్లికాబోతున్న తన భార్య అన్వితకి జరుగుతున్న సీమంతంలో రేవంత్ పాల్గొన్నాడు. దాంతో వారిద్దరూ చాలా ఎమోషనల్ అయ్యారు. దానికి సంబంధించిన ప్రొమో వీడియోని బిగ్‌బాస్ టీం విడుదల చేసింది.


బిగ్‌బాస్ హౌస్‌ ఉన్న అతనికి భార్య సీమంతం వేడుకలో పాల్గొనే అవకాశం రావడంతో చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే.. అది ప్రత్యక్షంగా కాదు.. లైవ్ వీడియో ద్వారా ఆ వేడుకలో పాల్గొనగలిగాడు. కుదరదు అనుకున్న భార్య సీమంతం చూసే అవకాశం రావడంతో చాలా ఆనందపడ్డాడు. బిగ్‌బాస్‌కి ధన్యవాదాలు తెలుపుతూ.. షో విజేతగా నిలిచినంత ఆనందంగా ఉందని చెప్పాడు. ఈ వేడుకలో ఇతర హౌస్ మేట్స్ కూడా పాల్గొని అతని ఆనందంలో పాలు పంచుకున్నారు.


అలాగే.. సీమంతం కోసం రేవంత్ భార్య ప్లేస్‌లో గీతూని కూర్చొబెట్టారు. హౌస్ మేట్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు గీతూకి పసుపు, కుంకుమ పుస్తున్నారు. అయితే.. దానికి రేవంత్ నిరాకరించాడు. తల్లి కాబోయే వారికి చేసే వేడుక సీమంతం అని, పెద్దలు పెట్టిన ఆ సంప్రదాయని ఏదో కారణం ఉండే ఉంటుందని నమ్ముతానని రేవంత్ చెప్పాడు. తన కోసం గాజులు, పండ్లు, మిఠాయిలు పంపిన భర్తతో విలువైన సమయం గడిపినందుకు అన్విత కూడా సంతోషించింది.

 

కాగా.. మరోవైపు గీతూకి, ఆది రెడ్డికి మధ్య సోదర, సోదరీమణుల బంధం నడుస్తున్న విషయం తెలిసిందే. తాజా ఎపిసోడ్‌లో తోబుట్టువుగా భావించే ఆది రెడ్డి టాస్క్ సమయంలో తనకి సపోర్టు చేయకపోవడంపై బాధపడింది. అలాగే బిగ్ బాస్ ట్రోఫీని గెలవడం తనకు ఎంత ముఖ్యమో కూడా చెప్పింది. అందుకే పంచ్ అవుట్ టాస్క్‌లో గీతూకి మద్దతుగా ఆది రెడ్డి నిలిచాడు. ఆమెనే కెప్టెన్‌గా ఉండటానికి అన్ని విధాల అర్హురాలని చెబుతూ అర్జున్‌తో గొడవ పడ్డాడు. అయితే.. బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్స్‌తో విన్నర్‌గా నిలిచే అవకాశాలు రేవంత్‌కి, గీతుకి మాత్రమే ఉన్నాయని అందరు అనుకుంటున్నారు. తాజాగా జరిగిన పరిణామాలతో ఈ ఇద్దరి మధ్య పోటీ ఇంకా టఫ్ అయ్యిందనే చెప్పాలి.



Updated Date - 2022-09-29T20:05:16+05:30 IST