Bigg Boss 6: ఫెమినిస్ట్‌ అన్నావ్‌.. డ్రెస్‌ లాగుతుంటే ఏం చేశావ్‌?

ABN , First Publish Date - 2022-09-27T23:30:33+05:30 IST

బిగ్‌బాస్‌ నాలుగోవారం నామినేషన్స్‌ హౌస్‌ దద్దరిల్లేలా జరిగాయి. ఒక్కొక్కరు ఇద్దరిద్దరు చొప్పున నామినేట్‌ చేయాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. నామినేట్‌ చేయాలనుకున్న వ్యక్తి తలపై పగలకొట్టి రీజన్‌ చెప్పాలని సూచించారు.

Bigg Boss 6: ఫెమినిస్ట్‌ అన్నావ్‌.. డ్రెస్‌ లాగుతుంటే ఏం చేశావ్‌?

బిగ్‌బాస్‌ నాలుగోవారం (Biggboss 6)నామినేషన్స్‌ హౌస్‌ దద్దరిల్లేలా జరిగాయి. ఒక్కొక్కరు ఇద్దరిద్దరు చొప్పున నామినేట్‌ చేయాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. నామినేట్‌ చేయాలనుకున్న వ్యక్తి తలపై పగలకొట్టి రీజన్‌ చెప్పాలని సూచించారు. తొలుత శ్రీహాన్‌తో(Srihaan) నామినేషన్స్‌ ప్రక్రియ మొదలైంది. తన పనైన తర్వాత కెమెరా దగ్గరకు వెళ్లి ప్రాణం పెట్టి ఆడాలి.. అవకాశం  ఒక్కసారే వస్తుంది.. గట్టిగా ఆడాలని యాక్టింగ్‌ మొదలుపెట్టాడు. అతని తీరు చూసిన ప్రేక్షకులు ఆ మాటల్ని ఆటలో చూపించు.. దానికోసం కెమెరా ముందు నంది లెవల్లో యాక్ట్‌ చేయాల్సిన పనిలేదు’ అంటూ నెట్టింట ట్రోల్‌ చేస్తున్నారు. 


ఇనాయాను (Audience support )నామినేట్‌ చేసిన సందర్భంలో అతని పూర్తి యాటిట్యూడ్‌ చూపించాడు. పిట్ట ఇష్యూ మీద నాగ్‌ క్లాస్‌ తీసుకున్నప్పటికీ మళ్లీ అదే టాపిక్‌ తీసుకొచ్చి ఇనయాతో వాదనకు దిగాడు. ఆ తరువాత ఆర్జే సూర్యకి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది ఇనయా. ఏమన్నా అంటే నేను ఫెమినిస్ట్‌ని అంటావ్‌ కదా.. అడవిలో ఆట టాస్క్‌లో నలుగురు నన్ను పట్టుకుని నన్ను లాక్కునివెళ్తుంటే నా డ్రెస్‌ పైకి లేచిపోతుందని అరిచినా పట్టించుకోకుండా లాక్కెళ్లారు. ఓ అమ్మాయిన అలా తీసుకెళ్తుంటే  ఫెమినిస్ట్‌గా నువ్వేం చేశావ్‌? అని ప్రశ్నించింది.. దానికి సమాధానంగా ఆ సమయంలో నీకు సపోర్ట్‌గా నీ చేతులు పట్టుకున్నది నేనే అని అన్నాడు సూర్య. అంతే కాదు నీ వల్ల ముగ్గురి ఆట నాశనమైంది అని సూర్య కౌంటర్‌ ఇచ్చాడు. ఈ విషయంలో సరిగా డిఫెండ్‌ చేయలేకపోయారు సూర్య. కీర్తి కూడా ఈ నామినేషన్స్‌లో గొంతెత్తినా సరైన కారణాలు చెప్పలేకపోయింది. ఫైమా నామినేషన్స్‌ హైలైట్‌గా నిలిచింది. ఒక్కో మాటతో ఆరోహికి చుక్కలు చూపించింది. ఈ నామినేషన్స్‌లో ఫైమా.. ఆరోహిని నామినేట్‌ చేస్తూ చెప్పిన పాయింట్స్‌ బాగా పేలాయి. జరిగిపోయిన విషయాలను గుర్తు పెట్టుకుని నామినేట్‌ చేయడం తప్పని చెప్పిన నువ్వు.. కెప్టెన్సీ విషయంలో పాట విషయాన్ని తీసుకుని నన్ను ఎలా టార్గెట్‌ చేస్తావ్‌’ అనడిగింది. శ్రీహాన్‌ని  సేవ్ చేయడానికి నన్ను టార్గెట్‌ చేశానని నాతో చెప్పి.. ఆ వెంటనే మరో రీజన్‌ ఉందని అన్నావ్‌.. అని జరిగిన విషయం మొత్తం బయట పెట్టింది ఫైమా. నాలుగో వారం నామినేషన్స్‌లో పది మంది కంటెస్టెంట్స్‌ నామినేట్‌ అయ్యారు. ఇనయ, రేవంత్‌, ఆరోహి, సూర్య, సుదీప, శ్రీహాన్‌, గితు, రాజ్‌, అర్జున్‌, కీర్తి ఈ పది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే టార్గెట్‌ చేసినట్లు ఇంటి సభ్యుల్లో ఎక్కువ మంది ఇనయాను నామినేట్‌ చేశారు. ఆరోహి, శ్రీ సత్య, చంటి, రోహిత్‌ మెరీనా, కీర్తి, శ్రీహాన్‌, సుదీప, గీతూ,  ఆర్జే సూర్య అంటే ఇంట్లో సగానికి పైగా సభ్యులు ఇనయని నామినేట్‌ చేశారు. దీనితో ఆమె స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా మారంది. జనాల్లో ఆమెపై సింపథీ పెరిగేలా ఇంటి సభ్యులే చేశారు. బిగ్‌ బాస్‌ లెక్క ప్రకారం ఏ కంటెస్టెంట్‌ని ఎక్కువ టార్గెట్‌ చేస్తుంటారో.. ఆ కంటెస్టెంట్‌కి ఆడియన్స్‌ నుంచి మద్దతు బాగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఇనాయాకు ఇది కలిసొచ్చే విషయమే!






Updated Date - 2022-09-27T23:30:33+05:30 IST