Jasmin Bhasin: రేప్ చేసి చంపేస్తామంటూ బిగ్‌బాస్ బ్యూటీకి బెదిరింపులు.. ధైర్యముంటే బయటికి రండంటూ..

ABN , First Publish Date - 2022-08-31T16:19:30+05:30 IST

హిందీ బిగ్‌బాస్ 14(Bigg boss 14)తో పాపులారిటీ సాధించిన నటి జాస్మిన్ భాసిన్ (Jasmin Bhasin). ఆ షోతో వచ్చిన పాపులారిటీతో..

Jasmin Bhasin: రేప్ చేసి చంపేస్తామంటూ బిగ్‌బాస్ బ్యూటీకి బెదిరింపులు.. ధైర్యముంటే బయటికి రండంటూ..

హిందీ బిగ్‌బాస్ 14(Bigg boss 14)తో పాపులారిటీ సాధించిన నటి జాస్మిన్ భాసిన్ (Jasmin Bhasin). ఆ షోతో వచ్చిన పాపులారిటీతో ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు పెరిగాయి. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం దాదాపు 7 మిలియన్లకి పైగా ఫాలోవర్స్‌ని కలిగి ఉంది. అయితే.. ఈ భామ తాజాగా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత.. కొంతమంది ట్రోలర్లు తనను చంపుతామని, అత్యాచారం చేస్తామని బెదిరించారని జాస్మిన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.


బిగ్ బాస్ 14వ సీజన్‌లో కనిపించిన జాస్మిన్, దానిని అధిగమించడానికి వైద్య సహాయం తీసుకున్నట్లు చెప్పింది. జాస్మిన్ తన బిగ్ బాస్ అనుభవం గురించి మాట్లాడింది మరియు దీని వల్ల మానసికంగా చాలా బాధపడ్డానని చెప్పింది.


జాస్మిన్ మాట్లాడుతూ.. ‘నేను ఓ షో చేశాను. అందులో వారు నచ్చలేదని చెప్పడంతో నన్ను రేప్ చేసి, చంపుతామని బెదిరిస్తున్నారు. ఆ సమయంలో ఆ బెదిరింపులు నన్న మానసికంగా కృంగదీశాయి. అందులోంచి బయటపడటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దానికోసం ట్రీట్‌మెంట్‌తోపాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు చాలా సహాయం చేశారు. అయితే.. ఇప్పుడు మాత్రం ట్రోలింగ్ గురించి అంతగా పట్టించుకోవట్లేదు. నా పని మీద ఫోకస్ చేసి కెరీర్‌లో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది.


ట్రోలర్స్ గురించి జాస్మిన్ మాట్లాడుతూ.. ‘ట్రోలర్లుకి ధైర్యంలేదు. అందుకే కనపడకుండా ఇలాంటివి చేస్తున్నారు. మీకు దమ్ముంటే బయటకు వచ్చి ఇదంతా చెప్పండి. మీరు పని లేని పిరికివాళ్లు. ఇలాంటి వ్యక్తులు మనల్ని డిమోటివేట్ చేయాలనుకుంటున్నారు. అందుకే ఇలా చేస్తుంటారు’ అని తెలిపింది.


బిగ్ బాస్ 14లో ఉన్నప్పుడే జాస్మిన్‌కి మరో కంటెస్టెంట్ అలీ గోని మధ్య ప్రేమ చిగురించింది. షోలో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని వ్యక్త పరుచుకున్నారు. అప్పటి నుండి ఈ జంట తరచుగా కలిసి కనిపిస్తారు. ఇద్దరూ తమ ప్రేమను సోషల్ మీడియాలో కూడా తరచుగా వ్యక్తపరుస్తుంటారు.


కాగా.. 2011లో తమిళ చిత్రం వానంతో జాస్మిన్ భాసిన్ తొలిసారిగా సినీ ప్రపంచానికి పరిచయమైంది. అనంతరం ‘దిల్ సే దిల్ తక్’, ‘దిల్ తో హ్యాపీ హై జీ’, ‘నాగిన్ 4(Naagin 4)’ వంటి అనేక విజయవంతమైన టీవీ షోలలో కనిపించింది. ఈ భామ ‘హానీమూన్’ అనే చిత్రంతో పంజాబీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతోంది. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తైంది.

Updated Date - 2022-08-31T16:19:30+05:30 IST