ఎయిర్‌పోర్ట్‌లో భర్తతో బిగ్‌బాస్ బ్యూటీ చేసిన పనికి.. ఛీ అంటున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2021-12-30T15:58:59+05:30 IST

‘బిగ్‌బాస్ 13’తో గుర్తింపు పొందిన నటి షెఫాలీ జరివాలా. ఈ బ్యూటీ తాజాగా న్యూయార్క్ వెళ్లింది.

ఎయిర్‌పోర్ట్‌లో భర్తతో బిగ్‌బాస్ బ్యూటీ చేసిన పనికి.. ఛీ అంటున్న నెటిజన్లు

‘బిగ్‌బాస్ 13’తో గుర్తింపు పొందిన నటి షెఫాలీ జరివాలా. ఈ బ్యూటీ తాజాగా న్యూయార్క్ వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె భర్త, ‘బ్రహ్మ రక్షక్’ ఫేం పరాగ్ త్యాగి ఈ భామకి సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాడు. ఈ సమయంలో వారు చేసిన ఓ పనికి విపరీతంగా ట్రోలింగ్ చేశారు నెటిజన్లు.


సెటబ్రిటీలు వేరే ప్లేసులకి వెళ్లడం, రావడం మామూలే. ఈ తరుణంలో వారి లుక్స్ క్యాప్చర్ చేయడానికి ఇటీవలే ఎక్కువగా మీడియా ట్రై చేస్తున్నా విషయం తెలిసిందే. అందుకే చాలా మంది పాప్‌కి ఫోజులు సైతం ఇస్తుంటారు. ఈ నటీనటులు సైతం అలాగే చేశారు. కానీ నార్మల్‌గా స్టిల్స్ ఇవ్వకపోవడంతో విమర్శల పాలయ్యారు.


సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన పరాగ్ షెపాలీకి ప్రేమగా లిప్‌లాక్ ఇచ్చాడు. అలా రెండు సార్లు ఇచ్చుకున్న తర్వాత మీడియా రావడం చూసి.. మరోసారి గాఢంగా ముద్దు పెట్టుకున్న ఈ సెలబ్రిటీ కపుల్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ కావడంతో ’అతి చేస్తున్నారు చూడండి’ అంటూ ట్రోలింగ్ చేశారు నెటిజన్లు.


‘ఛీ రహస్యంగా చేయాల్సిన పనిని కావాలని కెమెరాల కోసం చేస్తున్నారం’టూ ఒకరు కామెంట్ చేయగా.. ‘మీకు ఇంట్లో ప్రత్యేకంగా గదులు లేవా’ అంటూ మరికొందరు విమర్శలు చేశారు. ‘చాలా చిల్లరగా ఉంది. పబ్లిక్ ప్లేస్ మంచిగా ప్రవర్తించండి. ఇలాంటివన్నీ ఇంట్లో చేసుకోండి’ అంటూ మరొకరు కామెంట్స్ చేశారు. ఆ వైరల్ వీడియోని మీరు ఓ సారి చూసేయండి..



Updated Date - 2021-12-30T15:58:59+05:30 IST