Bigboss 6 : అదరగొడుతోన్న ప్రోమో !

ABN , First Publish Date - 2022-08-09T18:45:17+05:30 IST

తెలుగు రియాలిటీ షోస్‌లో నెం. 1 అనిపించుకుంది ‘బిగ్‌బాస్’ (Bigboss). ఇప్పటివరకూ 5 సీజన్స్‌ను విజయంతంగా పూర్తి చేసుకొన్న ఈ షో 6వ సీజన్ అతి త్వరలో మొదలు కాబోతోంది. ప్రతీ సీజన్ లోనూ సరికొత్త ఫేసులు, ప్రేమలు, టాస్కులు, నామినేషన్స్, ఎలిమినేషన్స్... గొడవ, గందర గోళంలకు ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతూ వచ్చారు.

Bigboss 6 : అదరగొడుతోన్న ప్రోమో !

తెలుగు రియాలిటీ షోస్‌లో నెం. 1 అనిపించుకుంది ‘బిగ్‌బాస్’ (Bigboss). ఇప్పటివరకూ 5 సీజన్స్‌ను విజయంతంగా పూర్తి చేసుకొన్న ఈ షో 6వ సీజన్ అతి త్వరలో మొదలు కాబోతోంది. ప్రతీ సీజన్ లోనూ సరికొత్త ఫేసులు, ప్రేమలు, టాస్కులు, నామినేషన్స్, ఎలిమినేషన్స్... గొడవ, గందర గోళంలకు ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతూ వచ్చారు. 6వ సీజన్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ప్రమోగాత్మకంగా ఓటీటీలోకి అడుగుపెట్టి సూపర్ సక్సెస్ అయింది బిగ్‌బాస్. ఇప్పుడు ‘బిగ్‌బాస్ 6’ కోసం రంగం సిద్ధమైపోయింది. యథావిధిగా ఈ సీజన్‌కూ నాగార్జునే (Nagarjuna) హోస్టింగ్ చేస్తున్నారు. ఈ సారి ఎవరెవరు ఈ షోలో కంటెస్ట్ చేస్తారా అని ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు వీక్షకులు.  బిగ్‌బాస్ 6 లోగో వచ్చిన వారం లోపే ప్రోమోనూ వదిలి.. మరింతగా ఆసక్తిని రేకెత్తించారు నిర్వాహకులు. 


‘బిగ్‌బాస్’ సీజన్ 6 (Bigboss season 6) కోసం గ్రాండ్ గా ఓ పెళ్ళి సెటప్ చేశారు. పెళ్ళిజరిగిపోయాకా.. అమ్మాయిని అత్తింటికి పంపడానికి తల్లిదండ్రులు బాధపడుతుంటారు. కొత్త పెళ్ళికూతురు కూడా మిమ్మల్ని వదలడం ఇష్టంలేదని కన్నీరు పెట్టుకుంటుంది. ఇంతలో ఫోన్‌లో బిగ్‌బాస్ అనౌన్స్ మెంట్ రాగానే.. అక్కడ నుంచి అందరూ మాయం. వారంతా టీవీలకు అతుక్కుపోతారు. నాగార్జున ఎంట్రీ ఇస్తారు. మైడియర్ అంటూ ఆయన అదిరిపోయే ఎంట్రీ ఆకట్టుకుంటోంది. అప్పగింతలయ్యే వరకూ ఆగలేకపోయారంటే.. అక్కడ ఆట మొదలైనట్టే. లైఫ్ లో ఏ మూమెంట్ అయినా.. బిగ్‌బాస్ తర్వాతే. బిగ్‌బాస్ సీజన్ 6 ఎంటర్‌టైన్‌మెంట్‌కు అడ్డా ఫిక్స్’ అంటూ నాగ్ కమింగ్ సూన్ ప్రోమోతో అదరగొట్టారు. 


అన్ని సీజన్స్‌ లాగానే.. ఈ సీజన్‌లో కూడా గుర్తింపు పొందిన సినీతారలు, క్రేజీ యూట్యూబర్స్, ఫేమస్ యాంకర్స్ కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సీజన్ మరింత స్పైసీగా ఉండబోతోందని, టాస్కులు సరికొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది. అలాగే.. బిస్‌బాస్ సెట్‌ డిజైనింగ్ లోనూ భారీ మార్పులుండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. మరి బిగ్‌బాస్ సీజన్ 6 ఎప్పుడు మొదలవుతుందో.. ఈ సీజన్ ఇంకెలా రక్తికడుతుందో చూడాలి.   

Updated Date - 2022-08-09T18:45:17+05:30 IST