Bigboss 6 : ఫైనల్ లిస్ట్ ఇదేనా?

ABN , First Publish Date - 2022-08-17T01:36:25+05:30 IST

తెలుగులో మోస్ట్ సక్సెస్ ఫుల్ రియాలిటీ షోగా ‘బిగ్‌బాస్’ (Bigboss) తన ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పటివరకూ 5 సీజన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు ఆరో సీజన్ లోకి అడుగుపెట్టింది ఈ షో. ఈ సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని వీక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Bigboss 6 : ఫైనల్ లిస్ట్ ఇదేనా?

తెలుగులో మోస్ట్ సక్సెస్ ఫుల్ రియాలిటీ షోగా ‘బిగ్‌బాస్’ (Bigboss) తన ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పటివరకూ 5 సీజన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు ఆరో సీజన్ లోకి అడుగుపెట్టింది ఈ షో. ఈ సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని వీక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 6 సీజన్ ‌లోని టాస్కులు, నామినేషన్ అండ్ ఎలిమినేషన్ ప్రోసెస్ ఇంకెలా ఉంటుందా అని ఆత్రుతగా ఉన్నారు. అన్ని సీజన్స్ కన్నా ఆరో సీజన్ కాస్తంత స్పైసీగా ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే.. వివాదాలకూ ఏమాత్రం ఢోకా ఉండదని టాక్. దానికి తగ్గట్టుగానే ఈ షోలో కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ షోకు కూడా నాగార్జునే (Nagarjuna) హోస్టింగ్ చేయబోతున్నారు. దానికి  సంబంధించిన ప్రోమో కూడా ప్రస్తుతం ప్రసారం అవుతోంది. బిగ్ బాస్ సీజన్ 6  సెప్టెంబర్ 4 నుంచి గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. 


ఇక ‘బిగ్‌బాస్ 6’ (Bigboss 6) ఫైనల్ లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇప్పటికే ఎంపికైన కంటెస్టెంట్స్‌ను అన్నపూర్ణ స్డూడియోలోనే క్వారంటైన్ కు పంపబోతున్నారట. అక్కడ వేసిన బిగ్‌బాస్ గ్రాండ్ సెట్ లోకి సెప్టెంబర్ 4 ఆదివారం సాయంత్రం పంపే కంటెస్టెంట్స్‌ను ఒక వారం పాటు క్వారంటైన్ లో ఉంచిన తర్వాతే హౌస్ లోకి పంపుతారట. కరోనాతో సమస్య లేకపోయినా.. హౌస్ లో ఎవరైనా ఇబ్బందిపడితే కష్టమని భావించి ఈ వారం క్వారంటైన్ ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఇక ఈ సీజన్ లో మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారట. వారి పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 


బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్స్ లిస్ట్ 

1. అజయ్ కుమార్

2. మిత్రా శర్మ

3. ఉదయభాను

4. ఆర్జే చైతూ

5. అనిల్ రాథోడ్

6. దీపికా పిల్లి

7. అమర్ దీప్ చౌదరి

8. శ్రీమాన్

9. నేహా చౌదరి

10. ఆర్జే సూర్య

11. ఆది రెడ్డి

12. నిఖిల్ విజేంద్ర

13. చలాకీ చంటి

14. శ్రీసత్య

15. ఇనయా సుల్తానా

16. పాండు మాస్టర్ 


Updated Date - 2022-08-17T01:36:25+05:30 IST