Bimbisara : ఆ ఒక్క సీన్‌కూ అంత బడ్జెట్టా?

ABN , First Publish Date - 2022-08-19T21:40:54+05:30 IST

ఇండస్ట్రీ క్రైసిస్ లో ఉన్న టైంలో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram) ‘బింబిసార’ (Bimbisara) సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. రెండు వారాల్లో డబుల్ ప్రాఫిట్స్ రాబట్టిన ఈ ఫాంటసీ డ్రామా, ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తోంది.

Bimbisara : ఆ ఒక్క సీన్‌కూ అంత బడ్జెట్టా?

ఇండస్ట్రీ క్రైసిస్ లో ఉన్న టైంలో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram) ‘బింబిసార’ (Bimbisara) సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. రెండు వారాల్లో డబుల్ ప్రాఫిట్స్ రాబట్టిన ఈ ఫాంటసీ డ్రామా, ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తోంది. టైం ట్రావెల్ జోనర్‌ను ప్రేక్షకులకి మళ్లీ పరిచయం చేసిన ఈ సినిమాలో హీరో ఎంత క్రూయల్‌గా ఉంటాడు? అతని నేచర్ ఏంటి? అనేది చూపించడానికి మేకర్స్... రాజ దర్బార్‌లో ఒక మొసలిని పెట్టారు. 


ఇంట్రడక్షన్ సీన్‌లో, కళ్యాణ్ రామ్ మొసలిపై నడుచుకుంటూ వచ్చే సీన్ ‘బింబిసార’ సినిమాలో గ్రాఫిక్స్ ఎంత క్వాలిటీయో చెబుతుంది. ఈ ఒక్క సీన్ కోసం కళ్యాణ్ రామ్ అండ్ టీమ్ దాదాపు 75 లక్షలు ఖర్చుపెట్టారట. ఆ ఖర్చు సినిమాకి పే ఆఫ్ ఇచ్చింది. ఆడియన్స్ ఈ సీన్ చూసి థియేటర్స్‌లో థ్రిల్ల్ ఫీల్ అయ్యారు. ఖర్చు ఎక్కడ పెట్టాలో తెలిస్తే బడ్జెట్ అదుపుతప్పదు. సినిమా రిజల్ట్ తేడా కొట్టదు. ఒకవేళ సినిమా పోయినా ప్రొడ్యుసర్ సేఫ్ జోన్‌లో ఉంటారు.

Updated Date - 2022-08-19T21:40:54+05:30 IST