Sitaramam : మృణాళినిగా ఆకట్టుకుంటున్న భూమికా చావ్లా

ABN , First Publish Date - 2022-07-21T17:50:57+05:30 IST

మాలీవుడ్ యంగ్ స్టార్ దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman).. తెలుగులో డైరెక్ట్‌గా నటిస్తున్న రెండో చిత్రం ‘సీతారామం’ (Sitaramam). హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో, వైజయంతి మూవీస్ సమర్పణలో, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది.

Sitaramam : మృణాళినిగా ఆకట్టుకుంటున్న భూమికా చావ్లా

మాలీవుడ్ యంగ్ స్టార్ దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman).. తెలుగులో డైరెక్ట్‌గా నటిస్తున్న రెండో చిత్రం ‘సీతారామం’ (Sitaramam). హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో, వైజయంతి మూవీస్ సమర్పణలో, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఇందులో దుల్ఖర్ లెఫ్టినెంట్ రామ్‌గానూ, మృణాల్ ఠాకూర్ (Mrinal Thakur) సీతగానూ నటిస్తున్నారు. అందాల రష్మికా మందణ్ణ (Rashmika Mandanna) కాశ్మీరీ ముస్లీమ్ అమ్మాయి అఫ్రీన్‌గా కీలక పాత్రలో నటిస్తోంది.‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ ట్యాగ్ లైన్ తో ఆసక్తికరమైన కథాకథనాలతో చిత్రం రూపొందుతోంది. ఒక అందమైన యువతితో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఒక సైనికుడు ప్రేమలో పడితే వారి బంధం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఈ అందమైన పీరియాడికల్ లవ్‌స్టోరీకి విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrasekhar) సంగీతం అందిస్తున్నారు. 


‘సీతారామం’ చిత్రం ఆగస్ట్ 5న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ట్రైలర్ విడుదల కానుంది. అలాగే.. ఇందులోని పాత్రల పరిచయ చిత్రాల్ని కూడా మేకర్స్ ఒకొకటిగా విడుదల చేస్తున్నారు. ఇంతకు ముందు సుమంత్ (Sumanth), గౌతమ్ మీనన్ (Gowtham Menon), రష్మికా మందణ్ణ (Rashmika Mandanna) పాత్రల లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఇందులో మృణాళినిగా అందాల భూమికా చావ్లా (Bhumika Chawla) పరిచయ చిత్రాన్ని విడుదల చేశారు. ఒక పాపతో ఉన్న ఆమె లుక్ మెప్పిస్తోంది. బ్రిగేడియర్ విష్ణు శర్మగా నటిస్తున్న సుమంత్‌కు ఆమె భార్యగా నటిస్తున్నట్టు పోస్టర్‌పై తెలిపారు. భూమిక ‘యువకుడు’ చిత్రంతో టాలీవుడ్ లోకి కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. అందులో హీరోగా సుమంత్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్ళకు వారిద్దరూ ‘సీతారామం’ చిత్రంతో మళ్ళీ జోడీగా నటించనుండడం విశేషం.


పీయస్ వినోద్ (PS Vinod) ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలోని ప్రధాన భాగం కాశ్మీర్‌లో షూటింగ్ జరుపుకోవడం విశేషం. ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఒక పోస్టాఫీస్‌లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. హీరో ఇక్కడి నుంచే కథానాయికకు ఉత్తరాలు రాస్తాడు. కథను కీలక మలుపు తిప్పే ఈ సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ సీన్స్ కోసం చిత్ర బృందం ఎన్నో కష్టాలు పడ్డట్టు దర్శకుడు హను రాఘవపూడి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. మరి ‘సీతారామం’ చిత్రం తర్వాత భూమిక మళ్ళీ టాలీవుడ్‌లో నటిగా బిజీ అవుతుందేమో చూడాలి. 



Updated Date - 2022-07-21T17:50:57+05:30 IST