అలాంటి భావాలను బద్దలు కొట్టడానికే.. ఇలాంటివి చేస్తున్నా : నటి

ABN , First Publish Date - 2022-03-13T18:45:02+05:30 IST

బాలీవుడ్‌లో ఎటువంటి సపోర్టు లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటీమణుల్లో భూమి పెడ్నేకర్ ఒకరు...

అలాంటి భావాలను బద్దలు కొట్టడానికే.. ఇలాంటివి చేస్తున్నా : నటి

బాలీవుడ్‌లో ఎటువంటి సపోర్టు లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటీమణుల్లో భూమి పెడ్నేకర్ ఒకరు. ఈ బ్యూటీ నటించిన తాజా చిత్రం ‘బదాయ్ దో’ ఇటీవలే విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. అందులో ఈ భామ మహిళల మీద ఇంట్రస్ట్ ఉండే పాత్రలో నటించింది. తాజాగా ఈ బ్యూటీ వెటరన్ యాక్టర్‌ నవాజుద్దీన్ సిద్ధిఖీతో సినిమా చేస్తోంది. అందులో మరో డిఫరెంట్ పాత్రను చేస్తోందట. ఆ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో భూమి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకుంది.


భూమి మాట్లాడుతూ.. ‘నవాజ్ సర్‌తో కలిసి పనిచేసే అవకాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే దేశంలోని అత్యుత్తమ నటులలో ఆయన ఒకరు. ఈ సినిమా ద్వారా ఆయన నుంచి చాలా నేర్చుకునే అవకాశం వచ్చింది. అలాగే సుధీర్ సర్‌తో కలిసి పనిచేయలని కూడా చాలా రోజులుగా అనుకుంటున్నా. ఆయనతో పనిచేయలని ఎంతో మంది నటులు అనుకుంటారు’ అంటూ చెప్పుకొచ్చింది.


సినిమాలలో తన పాత్రల గురించి భూమి మాట్లాడుతూ.. ‘నా సినిమాల్లో నేను ఎక్కువగా స్త్రీల తరుఫున నిలబడే పాత్రలే చేశాను. నా నుంచి వారు అవే కోరుకుంటున్నారని అనుకుంటున్నా. నేను ఇండస్ట్రీలో ఉన్న మూస ధోరణుల బద్దలు కొట్టాలనుకుంటున్నా. అందుకే ఎంతో పవర్‌ఫుల్ మీడియమైన సినిమా ద్వారా అది చూపించాలనుకుంటున్నా. అందుకే డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నా’ అని తెలిపింది.

Updated Date - 2022-03-13T18:45:02+05:30 IST