1200 మంది మహిళా పోలీస్ సిబ్బందికి ‘భీమ్లా నాయక్’ షో

ABN , First Publish Date - 2022-03-08T22:47:17+05:30 IST

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా.. 1200 మంది మహిళా పోలీస్ సిబ్బందికి ఉచితంగా ‘భీమ్లా నాయక్’ సినిమాని చూపించనున్నారు నగర సీపీ సీవీ ఆనంద్. హైదరాబాద్ జీవీకే మాల్‌లో..

1200 మంది మహిళా పోలీస్ సిబ్బందికి ‘భీమ్లా నాయక్’ షో

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా.. 1200 మంది మహిళా పోలీస్ సిబ్బందికి ఉచితంగా ‘భీమ్లా నాయక్’ సినిమాని చూపించనున్నారు నగర సీపీ సీవీ ఆనంద్. హైదరాబాద్ జీవీకే మాల్‌లో సాయంత్రం 6 గంటలకు ఈ షో ప్రదర్శించనున్నారు. ‘భీమ్లా నాయక్’ చిత్రంలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన విషయం తెలిసిందే. అలాగే సినిమాలో హరిణి పాత్రలో నటించిన ఓ లేడీ కానిస్టేబుల్‌‌‌ను ‘భీమ్లా నాయక్’ సేవ్ చేసే విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ సందర్భంలో మహిళల గురించి పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్స్ కూడా అందరితో క్లాప్స్ కొట్టేలా చేస్తాయి. ఈ సన్నివేశంతో పాటు, ‘పోలీసుల తలకు బాధ్యత ఎక్కువ.. అందుకే ఎప్పుడూ నిటారుగా ఉండాలి’ వంటి డైలాగ్స్, కథ కూడా పోలీసుల ఆత్మగౌరవానికి సంబంధించింది కావడంతో మహిళా పోలీసులకు ఈ సినిమాని సీపీ ఆనంద్ చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.


పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్-స్ర్కీన్‌ప్లే సమకూర్చగా ఎస్.ఎస్. థమన్ సంగీత బాధ్యతలను నిర్వర్తించారు. పవన్ కల్యాణ్ సరసన నిత్యామీనన్, రానా దగ్గుబాటి సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రావు రమేష్, మురళీ శర్మ, సముద్రఖని వంటివారు ఇతర పాత్రలలో నటించారు. 

Updated Date - 2022-03-08T22:47:17+05:30 IST