ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘భీమ్లా నాయక్’ రెండో ట్రైలర్

ABN , First Publish Date - 2022-02-24T03:27:19+05:30 IST

పవన్ కల్యాణ్ అభిమానులను ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మేకర్స్ సర్‌ప్రైజ్ చేశారు. చిత్రానికి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ అంటూ మరో ట్రైలర్‌ను విడుదల చేశారు. వాస్తవానికి మొదట విడుదల

ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘భీమ్లా నాయక్’ రెండో ట్రైలర్

పవన్ కల్యాణ్ అభిమానులను ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మేకర్స్ సర్‌ప్రైజ్ చేశారు. చిత్రానికి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ అంటూ మరో ట్రైలర్‌ను విడుదల చేశారు. వాస్తవానికి మొదట విడుదల చేసిన ట్రైలర్‌ విషయంలో మెగాభిమానులు కాస్త నిరాశను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. మధ్యలో సౌండ్ మిక్సింగ్ కూడా ఇబ్బందికరంగా అనిపించడంతో, థమన్‌ని టార్గెట్ చేస్తూ.. కొందరు అభిమానులు ట్రోల్ చేశారు. దీంతో అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చేలా రెండో ట్రైలర్‌ని రెడీ చేసి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మేకర్స్ వదిలారు. ఈ ట్రైలర్‌లో డైలాగ్స్, సన్నివేశాలు, పోరాటాలు అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలు పెంచేవిగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



Updated Date - 2022-02-24T03:27:19+05:30 IST