నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. ‘భీమ్లా నాయక్’ బీభత్సం

ABN , First Publish Date - 2022-01-01T00:58:20+05:30 IST

నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జరిగే పార్టీల్లో మోత మోగించేందుకు ‘భీమ్ల నాయక్’ టీమ్ ఓ పాటని తాజాగా విడుదల చేసింది. ‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి గత నెల 7వ తేదీన విడుదలైన ‘లాలా భీమ్లా అడవి పులి’ గీతాన్ని.. ఇప్పుడు

నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. ‘భీమ్లా నాయక్’ బీభత్సం

నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జరిగే పార్టీల్లో మోత మోగించేందుకు ‘భీమ్ల నాయక్’ టీమ్ ఓ పాటని తాజాగా విడుదల చేసింది. ‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి గత నెల 7వ తేదీన విడుదలైన ‘లాలా భీమ్లా అడవి పులి’ గీతాన్ని.. ఇప్పుడు డీజే వెర్షన్లో మరో మారు విడుదల చేసింది చిత్ర బృందం. 2021కి వీడ్కోలు పలుకుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విడుదల చేసిన ఈ గీతం ఈ రాత్రి(డిసెంబర్ 31) బీభత్సం సృష్టించడం ఖాయం. ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాసే ఈ గీతాన్ని రచించటం విశేషం. మాటల్లో మాత్రమే కాదు పాటలో సైతం ఆయన తనదైన శైలిని పలికించారన్నది స్పష్టం చేసిందీ గీతం. సామాజిక మాధ్యమాలలో సైతం హోరెత్తింది ఈ గీతం. ‘భీమ్లా నాయక్’ పోరాట సన్నివేశాల్లో భాగంగా ఈ గీతం కనిపిస్తుంది. ఎస్. ఎస్. థమన్ స్వరాలు, అరుణ్ కౌండిన్య గాత్రం మరింత హుషారును కలిగిస్తే.. మూడు నిమిషాల ముప్ఫై ఏడు సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి‌ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. 2022, ఫిబ్రవరి 25వ తేదీన చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నట్లుగా మేకర్స్ తెలిపారు.



Updated Date - 2022-01-01T00:58:20+05:30 IST