‘భీమ్లానాయక్’ హిందీ విడుదల ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2022-03-01T02:38:33+05:30 IST

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాగర్‌. కె చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మాటలు- స్ర్కీన్‌ప్లే అందించిన..

‘భీమ్లానాయక్’ హిందీ విడుదల ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాగర్‌. కె చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మాటలు- స్ర్కీన్‌ప్లే అందించిన ఈ చిత్రం తాజాగా విడుదలై బ్లాక్‌బస్టర్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. వాస్తవానికి ఫిబ్రవరి 25నే హిందీలోనూ ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ చిత్రం హిందీలో విడుదల కాలేదు.


అయితే ‘భీమ్లా నాయక్’ హిందీ వెర్షన్ మార్చి 4న విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హిందీ వెర్షన్‌కి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని టాక్ నడుస్తుంది. పీవిఆర్ సినిమాస్ అఫీషియల్ ట్విట్టర్‌లో కూడా మార్చి 4న ‘భీమ్లా నాయక్’ హిందీ విడుదలకాబోతోంది అని తెలిపారు. అయితే మేకర్స్ వైపు నుండి మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.



Updated Date - 2022-03-01T02:38:33+05:30 IST