లైంగిక దాడి తరువాత 5 ఏళ్లకు జనం ముందుకు... భావన కోసం standing ovation!

ABN , First Publish Date - 2022-03-20T03:35:51+05:30 IST

మలయాళ నటి భావనా ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ’ వేదికపై కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. శుక్రవారం ఆమె స్టేజీపైకి రావటంతో చూస్తోన్న జనం మొదట ఆశ్చర్యపోయారు. ఆమె అక్కడికి వస్తోందని ముందుగా నిర్వాహకులు ప్రకటించలేదు. దాంతో 5 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత భావన ఇచ్చిన సర్‌ప్రైజ్ అప్పియరెన్స్ ప్రస్తుతం చర్చగా మారింది...

లైంగిక దాడి తరువాత 5 ఏళ్లకు జనం ముందుకు... భావన కోసం standing ovation!

మలయాళ నటి భావనా ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ’ వేదికపై కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. శుక్రవారం ఆమె స్టేజీపైకి రావటంతో చూస్తోన్న జనం మొదట ఆశ్చర్యపోయారు. ఆమె అక్కడికి వస్తోందని ముందుగా నిర్వాహకులు ప్రకటించలేదు. దాంతో 5 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత భావన ఇచ్చిన సర్‌ప్రైజ్ అప్పియరెన్స్ ప్రస్తుతం చర్చగా మారింది... 


2017లో నటి భావనా మెనన్‌పై లైంగిక దాడి జరిగింది. మలయాళ స్టార్ హీరో దిలీప్ ఆమెపై ఆ దాడి చేయించాడని ప్రచారం జరిగింది. భావన స్వయంగా కంప్లైంట్ చేయటంతో కేసు కూడా నమోదైంది. ఇంకా కోర్టులో విచారణ కొనసాగుతోంది. కాకపోతే, 2017 లైంగిక దాడి తరువాత ఆమె కొన్నాళ్లకి పెళ్లి చేసుకుని లైమ్ లైట్‌కి దూరంగా ఉండిపోయింది. మళ్లీ ఈ మధ్యే వెండితెర మీదకి తిరిగి రాబోతోన్నట్టు ప్రకటించింది. అయితే, మొదట్లో తాను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యానని, క్రమంగా కోలుకుంటున్నానని భావన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పింది. న్యాయం కోసం, తన లాంటి ఇతర బాధిత స్త్రీల కోసం పోరాటం చేస్తూనే ఉంటానని కూడా ఆమె వ్యాఖ్యానించింది. అయితే, త్వరలో ఓ మలయాళ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనున్న టాలెంటెడ్ యాక్ట్రస్ అనూహ్యంగా ‘కేరళ అంతర్జాతీయ సినీ సంబరా’నికి ముఖ్య అతిథిగా హాజరైంది. 


‘‘మంచి సినిమాని రూపొందించే వారికి, ఆదరించే వారికి... ఇద్దరికీ నా శుభకాంక్షలు’’ అన్న భావన... వేదిక మీదకి వస్తుండగానే స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. ఆమెని 5 ఏళ్ల తరువాత చూసిన జనం అమాంతం లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు! లైంగిక దాడి తరువాత నుంచీ భావనకి అనేక మంది నుంచీ భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. కేరళలోనే కాక దేశమంతటా ఆమెకి న్యాయం జరగాలంటూ చాలా మంది స్పందించారు. తాజాగా స్టాండింగ్ ఒవేషన్ దక్కటం భావన కమ్‌బ్యాక్‌కి గొప్ప నైతిక బలంగా మనం భావించవచ్చు...  



Updated Date - 2022-03-20T03:35:51+05:30 IST