Love: అందుకే రెండోసారి అతనితో నటించానంటున్న హీరోయిన్ వాణి

ABN , First Publish Date - 2022-12-09T17:59:42+05:30 IST

ఆర్‌.పి.ఫిలిమ్స్‌ బ్యానరుపై ఆర్‌.పి.బాల స్వీయ నిర్మాణ దర్శకత్వంలో కౌసల్య బాల తెరకెక్కించిన చిత్రం..

Love: అందుకే రెండోసారి అతనితో నటించానంటున్న హీరోయిన్ వాణి

ఆర్‌.పి.ఫిలిమ్స్‌ బ్యానరుపై ఆర్‌.పి.బాల స్వీయ నిర్మాణ దర్శకత్వంలో కౌసల్య బాల తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌’ (Love). రొటీన్‌ లవ్‌ స్టోరీ తరహాలో కాకుండా భిన్నమైన కథాంశాన్ని ఎంచుకుని నిర్మించారు. భరత్‌ (Bharath), వాణీ భోజన్‌ (Vaani Bhojan) హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర టీజర్‌ను తాజాగా రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ వాణీ భోజన్‌ మాట్లాడుతూ.. ‘కథ నచ్చడంతోనే భరత్‌తో కలిసి వరుసగా రెండో చిత్రంలో నటించాను. ఇందులో నేను భరత్‌ కలిసి పలుమార్లు దెబ్బలు తిన్నాం. యాక్షన్‌ సన్నివేశాలతో పాటు ప్రేక్షకులని ఆకట్టుకునే ఈ మూవీలో అంశాలున్నాయి’ అని చెప్పారు.


హీరో భరత్‌ మాట్లాడుతూ.. ‘ఈ స్టోరీ మొత్తం ఒక అపార్ట్‌మెంట్‌లోనే సాగుతుంది. స్ర్కీన్‌ప్లే చాలా థ్రిల్లింగ్‌‌గా ఉంటుంది. ఆర్‌.పి. బాల చాలా మంచి దర్శకుడు. ఆయనతో కలిసి జర్నీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది’ అని అన్నారు. దర్శక నిర్మాత ఆర్‌.పి.బాలా మాట్లాడుతూ.. ‘భరత్‌తో ఒక సినిమా చేయాలని భావించి అనేక కథలు వినిపించగా.. చివరకు దీనికి ఓకే చెప్పారు. భరత్‌, వాణి ఎంతో సహకారం అందించారు. నా తదుపరి చిత్రంలోనూ భరతే హీరో. వివేక్‌, డేనియల్‌ అద్భుతమైన నటులే మాత్రమే కాకుండా, మంచి స్నేహితులు. కెమరామెన్‌ పీజీ ముత్తయ్య ఈ సినిమాకు వెన్నెముకలా ఉన్నారు’ అని వివరించారు.



Updated Date - 2022-12-09T17:59:42+05:30 IST