Farhan weds Shibani : బ్యాండ్, బాజా, బారాత్... Bollywood

ABN , First Publish Date - 2022-02-20T00:12:40+05:30 IST

బాలీవుడ్‌లో ‘భాగ్ మిల్కా భాగ్’, ‘తూఫాన్’ వంటి చిత్రాల్లో నటించి

Farhan weds Shibani : బ్యాండ్, బాజా, బారాత్... Bollywood

బాలీవుడ్‌లో ‘భాగ్ మిల్కా భాగ్’, ‘తూఫాన్’ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫర్హాన్ అక్తర్. అతడు నాలుగేళ్లుగా శిబానీ దండేకర్‌తో డేటింగ్ చేస్తున్నాడు. తాజాగా ఫర్హాన్, శిబానీ  ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట ఫిబ్రవరి 19న పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అతడి అభిమానులందరూ ఈ పిక్స్‌ను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ వివాహానికి బీ టౌన్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయినట్టు తెలుస్తోంది. రియా చక్రవర్తి, హృతిక్ రోషన్, అనుష దండేకర్ వంటి సెలెబ్రిటీలు ఫర్హాన్, శిబానీ వెడ్డింగ్ సెరిమనీలో సందడి చేశారు. 


ఫర్హాన్ అక్తర్‌కు గతంలోనే అధునా బబానీతో వివాహాం అయింది. ఈ దంపతుల మధ్య అనంతరం అనేక మనస్పర్థాలు తలెత్తాయి. దీంతో ఫర్హాన్ 2016లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. అనంతరం శిబానీ దండేకర్‌తో డేటింగ్ చేయడం మొదలుపెట్టాడు. తాజాగా ఈ జంట పెళ్లి చేసుకున్నారు. కరోనా దృష్ట్యా వివాహాన్ని నిరాండబరంగా కానిచ్చారు. కొంతమంది సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయినట్టు బీ టౌన్ వర్గాలు తెలుపుతున్నాయి.

Updated Date - 2022-02-20T00:12:40+05:30 IST