నూతన నటుడు జయంత్ హీరోగా అనూషా రాయ్, సెహర్ కృష్ణన్ హీరోయిన్లుగా నటించే ‘నెల్సన్’ చిత్రం షూటింగ్ సంస్థ కార్యాలయంలో మొదలైంది. సునీల్ నిమ్మల ఈ చిత్రానికి దర్శకుడు. థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకొనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ రాజమండ్రిలో ప్రారంభం కానుంది. వైజాగ్, హైదరాబాద్‌లో జరిగే షూటింగ్‌తో చిత్రం పూర్తవుతుంది. ఆనంద చక్రపాణి, షాని, హరికృష్ణ చదలవాడ, ‘పుష్ప’ ఫేమ్ రాజు, దివ్య, నవీనారెడ్డి, రాజారెడ్డి, సంతోష్ సింగ్, చందు బి ఇదతరు ముఖ్య తారాగణం. జయంత్ కార్తీక్ ఈ చిత్రానికి నిర్మాత.