Doctor Strange 2 Twitter review: ‘అవెంజర్స్’ సిరీస్‌లో రానున్న కొత్త సినిమా ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2022-05-05T18:25:34+05:30 IST

‘అవెంజర్స్’.. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌ సినిమాల గురించి తెలియని సినీ లవర్ లేరంటే అతిశయోక్తి కాదు. ఈ ఇప్పటి వరకు మార్వెల్ సంస్థ నిర్మాణంలో..

Doctor Strange 2 Twitter review: ‘అవెంజర్స్’ సిరీస్‌లో రానున్న కొత్త సినిమా ఎలా ఉందంటే..

‘అవెంజర్స్’.. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌ సినిమాల గురించి తెలియని సినీ లవర్ లేరంటే అతిశయోక్తి కాదు. ఈ ఇప్పటి వరకు మార్వెల్ సంస్థ నిర్మాణంలో వచ్చిన ఈ సిరీస్‌లో 27 సినిమాలు, 5 వెబ్‌సిరీస్‌లు విడుదలయ్యాయి. ఈవన్నీ కూడా మంచి ప్రేక్షకాదరణని పొందాయి. దీంతో ఈ మూవీస్ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ముఖ్యంగా ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు. విడుదలైన మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకొని ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ ముందు వరకు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ‘అవతార్’ మొదటి స్థానంలో ఉండేది. అలాగే ఇటీవలే విడుదలైన స్పైడర్ మ్యాన్ మూవీ ‘నో వే హోమ్’ కూడా రికార్డు కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ తరుణంలో ఈ సిరీస్‌లో వస్తున్న మరో మూవీ ‘డాక్టర్ స్ట్రేంజ్: మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్‌’. గత సినిమా ప్రభావంతో, అలాగే 2016లో వచ్చిన డాక్టర్ స్ట్రేంజ్ మొదటి భాగం సూపర్ హిట్ అవ్వడంతో ఈ మూవీపై సైతం అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.


ఈ సిరీస్‌లో 27వ మూవీగా మే 6న విడుదల అవుతున్న ఈ చిత్రంలో బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. విడుదలకి ముందే ఈ మూవీ క్రిటిక్స్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. దీంతో ఈ సినిమా చూసిన పలువురు క్రిటిక్స్ సినిమా గురించి ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలిపారు. అందులో.. డాక్టర్ స్ట్రేంజ్ మూవీ అద్భుతమని, మార్వెల్ మూవీస్‌లో లేని భయంకరమైన హింస ఇందులో ఉందట. అంతేకాకుండా మొదటి సారి డార్క్ ఎలిమెంట్స్‌తో వస్తున్న ఈ సినిమా ఓ వైపు నవ్వులు పూయిస్తూనే మరోవైపు భయపెడుతుందట. సామ్ రైమి దర్శకత్వం వహించిన ఈ మూవీలో వాండాగా ఎలిజబెత్ ఒల్సెన్, స్ట్రేంజ్‌గా బెనెడిక్ట్ నటనలో ఇరగదీశారని చెబుతున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా సంచలనాలు సృష్టించిందని ట్వీట్స్ చేస్తున్నారు.















Updated Date - 2022-05-05T18:25:34+05:30 IST