కన్నీళ్లు పెట్టుకున్న బెనర్జీ.. మోహన్ బాబు కూతుర్ని ఎత్తుకుని తిరిగా.. అలాంటి నాపైనే..

ABN , First Publish Date - 2021-10-12T23:45:49+05:30 IST

‘మా’ ఎన్నికల వేడి, పోలింగ్ జరిగి రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాక కూడా, తగ్గటం లేదు. ప్రకాశ్ రాజ్ ఓటమి పాలయ్యాక తాజాగా ఆయన ప్యానెల్ తరుఫున గెలిచిన ఇతర సభ్యులు కూడా తమతమ పదవులకి రాజీనామా చేశారు.

కన్నీళ్లు పెట్టుకున్న బెనర్జీ.. మోహన్ బాబు కూతుర్ని ఎత్తుకుని తిరిగా.. అలాంటి నాపైనే..

‘మా’ ఎన్నికల వేడి, పోలింగ్ జరిగి రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాక కూడా, తగ్గటం లేదు. ప్రకాశ్ రాజ్ ఓటమి పాలయ్యాక తాజాగా ఆయన ప్యానెల్ తరుఫున గెలిచిన ఇతర సభ్యులు కూడా తమతమ పదవులకి రాజీనామా చేశారు. ప్రెస్ మీట్‌లో భావోద్వేగంతో మాట్లాడిన వారంతా మా నూతన అధ్యక్షుడుగా మంచు విష్ణు సమర్థంగా పని చేయాలని ఆకాంక్షించారు. కాకపోతే, సీనియర్ నటులు బెనర్జీ మాత్రం తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఒక దశలో ఆయన కంటతడి కూడా పెట్టారు. 


మోహన్ బాబు తనని అందరి ముందు దారుణంగా బూతులు తిట్టటం బాధ కలిగించిందని బెనర్జీ అన్నారు. మంచు కుటుంబంతో తనకు ఎన్నో దశాబ్దాల అనుబంధం ఉందని చెప్పారు. మోహన్ బాబు కూతురు లక్ష్మీప్రసన్న పుట్టినప్పటి నుంచీ తాను మంచు ఫ్యామిలీకి సన్నిహితుడ్నని బెనర్జీ తెలిపారు. లక్ష్మిని చిన్నప్పుడు తన చేతుల్తో ఎత్తుకున్నాని గుర్తు చేసుకున్నారు. అటువంటి తనని మోహన్ బాబు తీవ్రమైన పదజాలంతో దూషించటం తీవ్రంగా బాధించిందని బెనర్జీ కంటతడి పెట్టారు...

Updated Date - 2021-10-12T23:45:49+05:30 IST