బాలీవుడ్‌ భామతో... బెల్లంకొండ

ABN , First Publish Date - 2022-05-18T05:53:58+05:30 IST

బెల్లంకొండ శ్రీనివాస్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగు పెట్టారు. ‘ఛత్రపతి’ రీమేక్‌తో. వి.వి.వినాయక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే....

బాలీవుడ్‌ భామతో... బెల్లంకొండ

బెల్లంకొండ శ్రీనివాస్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగు పెట్టారు. ‘ఛత్రపతి’ రీమేక్‌తో. వి.వి.వినాయక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌ చివరి దశకు వచ్చింది. అయితే ఇప్పటి వరకూ ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్న సంగతి తెలీలేదు. ఇప్పుడు హీరోయిన్‌ పోస్టు ఎవరికి దక్కిందన్న విషయం బయటకు వచ్చేసింది. ఇందులో బెల్లంకొండ సరసన బాలీవుడ్‌ భామ సుష్రత్‌ బారూచాని ఎంపిక చేశారు. మంగళవారం సుష్రత్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘ఛత్రపతి’ టీమ్‌ ఆమెకు శుభాకాంక్షలు అందజేస్తూ, టీమ్‌లోకి ఆహ్వానించింది. బాలీవుడ్‌లో తన ఖాతాలో కొన్ని హిట్లున్నాయి. ‘ప్యార్‌ కా పంచనామా’ రెండు భాగాల్లోనూ తను కథానాయికగా నటించింది. ‘సోను కే టీటుకీ స్వీటీ’లోనూ మెప్పించింది. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న ‘రామ్‌ సేతు’లో కథానాయికగా కనిపించనుంది. 


Updated Date - 2022-05-18T05:53:58+05:30 IST